ఎట్టకేలకు గుంతలు పూడ్చారు

ప్రధానాంశాలు

ఎట్టకేలకు గుంతలు పూడ్చారు

‘ఈనాడు’ కథనానికి స్పందన

సిరికొండ, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మార్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయంగా మారింది. నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ‘ఈనాడు’ ప్రధాన సంచికలో బుధవారం ‘రహదారులు వర్షార్పణం’ శీర్షికతో కథనం ప్రచురితం కాగా.. జిల్లాస్థాయి అధికారులు స్పందించారు. కంకర చిప్స్‌ వేసి గుంతలను పూడ్చారు. త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని ఆర్‌అండ్‌బీ డీఈ సునీల్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని