చిరుధాన్యం.. చింతల్లేని జీవనం

ప్రధానాంశాలు

చిరుధాన్యం.. చింతల్లేని జీవనం

మిల్లెట్స్‌తో మధుమేహం దూరమంటున్న తాజా అధ్యయనం

ఈనాడు, సంగారెడ్డి: చిరుధాన్యాల (మిల్లెట్స్‌)తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. మధుమేహంతో బాధపడే వారు క్రమం తప్పకుండా వీటిని భోజనంలో భాగంగా చేసుకొంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరగకుండా చూడటం సాధ్యమవుతుందని తేల్చింది. 11 దేశాలకు చెందిన 65 పరిశోధనా పత్రాలను విశ్లేషిస్తూ సాగిన ఈ అధ్యయనంలో ఇక్రిశాట్‌, జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లతో పాటు మరో అయిదు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. ఈ ఫలితాలు ఇటీవలే ‘ఫ్రంటైర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చిరుధాన్యాల ఆహారంతో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 12-15 శాతం మేర తగ్గినట్లు వీరు గుర్తించారు. హెచ్‌బీఏ1సీ స్థాయి కూడా క్రమంగా తగ్గుతూ ప్రీడయాబెటిక్‌ నుంచి సాధారణ స్థాయికి చేరుకుంటారని స్పష్టం చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయం చాలా పరిశోధనల్లో తేలింది... ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని తాజాగా గుర్తించామని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన సీనియర్‌ పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్‌ అనిత తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని