సాంబమసూరిని పోలిన ‘భవతి’

ప్రధానాంశాలు

సాంబమసూరిని పోలిన ‘భవతి’

తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగులో ఉంది. రైతులు ఎప్పటినుంచో సాంబమసూరి వరి రకాన్ని సాగుచేస్తున్నారు. ఈ రకం గింజనాణ్యత బాగుండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పంట దిగుబడి కూడా ఎక్కువగా రావడంతో రైతులు అధికంగా సాగుచేస్తున్నారు. అన్నానికి బాగుండటంతో వినియోగదారుల ఆదరణ కూడా పొందింది.  అయితే ఈ రకం పైరులో చీడపీడలు ఎక్కువగా ఆశిస్తుండటంతో శాస్త్రవేత్తలు ఈ రకాన్ని పోలిన నూతన సన్నగింజ వంగడాల రూపకల్పన కోసం అనేక సంవత్సరాలుగా పలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ దిశలో కొన్ని రకాలను కూడా అభివృద్ధి చేశారు. ఇటీవల సాంబమసూరిని పోలిన సన్నగింజ ‘భవతి’ వరి రకాన్ని బాపట్ల వరి పరిశోధనా స్థానం వారు విడుదల చేశారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భవతి రకం లక్షణలు ఏమిటి? దీని పంటకాలం ఎంత? ఇది ఏయే రకాల చీడపీడలను తట్టుకుంటుంది? ఏ సీజన్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది? ఎకరాకు ఎంత దిగుబడినిస్తుంది? ఈ రకం ప్రత్యేక గుణగణాలు ఏమిటి? సాంబమసూరితో పోల్చితే ఈ రకంలో ఉన్న పోషక విలువలు, నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి తేడాలున్నాయి?, ‘భవతి’ రకాన్ని సాగుచేస్తున్న రైతు అనుభవం వగైరా మరెన్నో అంశాలు ఆగస్టు ‘అన్నదాత’లో మీ కోసం.

మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత ఆగస్టు-2021 సంచికలో...

‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం.: 9121157979, 8008522248


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని