వరి నాటారు... ఇసుక ముంచింది

ప్రధానాంశాలు

వరి నాటారు... ఇసుక ముంచింది

చిత్రాన్ని చూసి.. ఇది ఎండిన వాగో, కాలువో అనుకోకండి. ఓ పదిరోజుల క్రితం వరకూ ఇది కళకళలాడుతూ కనిపించిన ఓ పచ్చటి వరిచేను.. ఇటీవలి భారీవర్షాల కారణంగా ఇసుక, రాళ్ల మేటలతో ఇలా నిండిపోయింది.. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూరుకు చెందిన తెడ్డు రమేష్‌ రెండెకరాల్లో వరి నాట్లు వేశారు. ఈ మధ్య కురిసిన జడివానలకు ఊర చెరువు అలుగు పారింది. పొలాలను వరద ముంచెత్తింది. ప్రవాహ ధాటికి పొలంలోని మొలకలన్నీ కొట్టుకుపోయి ఇసుక మేటలు మిగిలాయి. ఈ నేపథ్యంలో తన పొలాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అదనపు ఖర్చు తప్పదని బాధిత రైతు వాపోతున్నారు. మరోవంక.. జిల్లావ్యాప్తంగా 1653 మంది రైతులకు చెందిన 3,084 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.

- ఈనాడు, నిజామాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని