‘హరిత’మై.. వినూత్న భరితమై!

ప్రధానాంశాలు

‘హరిత’మై.. వినూత్న భరితమై!

చేసే కార్యక్రమం ఏదైనా కానీ.. కాస్త వినూత్నత, ఇంకొంత వైవిధ్యం జోడిస్తే అది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇదే పంథాను అనుసరిస్తూ హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు అధికారులు సరికొత్త రీతిలో హరితహారం కొనసాగిస్తున్నారు. ఎండిపోయిన వృక్షాల మొదళ్లను భూమికి మూడడుగుల ఎత్తులో నరికించి.. వాటి మధ్యభాగాన్ని గుల్లచేసి అందులో మొక్కలను నాటడం ద్వారా చెట్టుకు మళ్లీ జీవం పోస్తున్నారు. ఫలితంగా మొక్కలకు అదనపు రక్షణతో పాటు అధికంగా పోషకాలు అందుతాయని చెప్తున్నారు. ఇలా నాటిన మొక్కల వేళ్లు భూమిలోకి వేగంగా వెళ్తాయని, ఎదుగుదల సైతం ఆశాజనకంగా ఉంటుందని వివరిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని