ఆపత్కాల సాయం ఇక లేనట్లే!

ప్రధానాంశాలు

ఆపత్కాల సాయం ఇక లేనట్లే!

ఈనాడు, హైదరాబాద్‌: బడులు తెరిచేవరకు ప్రైవేట్‌ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆపత్కాల సాయం అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని మూడు నెలలే అమలు చేసింది. గత ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వరుసగా మూడు నెలలపాటు రూ.2 వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యం అందజేసింది. భౌతికంగా పాఠశాలలు తీయనందున జులై నెలకు కూడా సాయం అందుతుందని సిబ్బంది ఎదురుచూస్తున్నారు. అయితే ఆగస్టు వచ్చినా జులైకు సంబంధించి సిబ్బంది వివరాలను విద్యాశాఖ అధికారులను ఇప్పటివరకు ఆర్థికశాఖ అడగలేదు. అంటే జులై నుంచి సాయం లేనట్లేనని తెలుస్తోంది. జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినందున సిబ్బంది విధుల్లోకి వచ్చిఉంటారని, అందువల్ల ఇక సాయం అవసరం లేదని ప్రభుత్వం భావించి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాఠశాలలు ప్రత్యక్షంగా తెరిచే వరకు సాయం అందజేయాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని