దివ్యాంగుల బాంధవుడు..

ప్రధానాంశాలు

దివ్యాంగుల బాంధవుడు..

దివ్యాంగులకు తన ఖర్చులతో పర్యాటక ప్రాంతాలను చూపిస్తూ ‘సరికొత్త సేవ’ చేస్తున్నారు రైల్వే ఉద్యోగి పాంగళ వెంకటేశ్వర్లు. అందరికీ ప్రకృతిలోని అందాలను తిలకించాలనే కోరిక ఉంటుంది. శరీరం సహకరించకపోవడం, అయినవారు చొరవ చూపకపోవడం వంటి కారణాలతో దివ్యాంగులు బయటి ప్రాంతాలను చూడడం అరుదే. అలాంటి వారి కోసం తన జీతంలో కొంత ఖర్చు పెడుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నారు వెంకటేశ్వర్లు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ట్రాక్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన గత ఆదివారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌కు చెందిన 10 మంది దివ్యాంగులను, దుమ్ముగూడెంకు చెందిన 15 మందిని, సంగారెడ్డికి చెందిన అయిదుగురిని, వారికి సహాయంగా 15 మందిని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో బోట్‌ షికారు చేయించారు. అంత్యాక్షరి, ఆటపాటలతో అందరూ సరదాగా గడిపేలా కార్యక్రమం నిర్వహించారు. భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని తిరిగి ఇళ్ల వద్ద దింపారు. ఇలా సంవత్సరంలో రెండుసార్లు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలకు దివ్యాంగులను తీసుకువచ్చి చూపిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

- ఈనాడు, సంగారెడ్డి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని