కొలనోస్కొపీ ఇక సులభమే!

ప్రధానాంశాలు

కొలనోస్కొపీ ఇక సులభమే!

వినూత్న పరికరం రూపొందించిన డా.రామిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పెద్ద పేగును పరీక్షించడానికి కొలనోస్కొపీ చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ యలకా రామిరెడ్డి. పెద్దపేగు లోపలి పొరల్లో ఉన్న పీలికల్ని గుర్తించేందుకు వైద్యులు పడుతున్న పాట్లను తీర్చేందుకు ‘కాంపోజిట్‌ పోలిపెక్టమీ స్నేర్‌’ అనే ఓ వినూత్న పరికరాన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం పేటెంట్‌ కల్పించింది. డా.రామిరెడ్డి హైదరాబాద్‌లోని గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుగా పనిచేస్తున్నారు. కాంపోజిట్‌ పోలిపెక్టమీ స్నేర్‌తో కొలనోస్కొపీ చేయడం సులభం కావడంతోపాటు సమయమూ చాలా ఆదా అవుతుందని ఆయన తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో అయ్యే అంతర్గత రక్తస్రావాన్నీ ఈ పరికరం నియంత్రిస్తుందని చెప్పారు. త్వరలోనే ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్‌ రామిరెడ్డి తన ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు పొందడం ఇది రెండోసారి. గతంలో అన్నవాహిక క్యాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోగుల కోసం ‘ఫీడింగ్‌ పైపు’ని రూపొందించారు. క్యాన్సర్‌తో అన్నవాహిక పూర్తిగా మూసుకుపోయిన వారికి ఆహారమిచ్చేందుకు ఇది పనిచేస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని