ఔషధ పరీక్షలకు సూక్ష్మ క్లోమాలు

ప్రధానాంశాలు

ఔషధ పరీక్షలకు సూక్ష్మ క్లోమాలు

వాషింగ్టన్‌: క్లోమాన్ని పోలిన చిన్నపాటి అవయవాన్ని వృద్ధి చేసే సరికొత్త విధానాన్ని అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన, క్యాన్సర్‌ కణాలను ఉపయోగించారు. క్లోమ క్యాన్సర్‌పై కొత్త ఔషధాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇవి అద్భుతంగా పనికొస్తాయి. క్లోమం చుట్టూ ఉండే ఎక్స్‌ట్రాసెల్యులర్‌ వాతావరణాన్ని అనుకరించే ప్రత్యేక జెల్‌ సాయంతో ఆ అవయవానికి సంబంధించిన సూక్ష్మ రూపాలను శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. క్లోమంలోని కణతులు, వాటి చుట్టూ ఉన్న వాతావరణానికి మధ్య ముఖ్యమైన చర్యల గురించి అర్థం చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఈ జెల్‌ పూర్తిగా కృత్రిమమైంది. పాలీఇథలీన్‌ గ్లైకాల్‌ (పీఈజీ)తో తయారైంది. దీన్ని చాలా తేలిగ్గా ఉత్పత్తి చేయవచ్చు. ఈ జెల్‌లోకి ఎక్స్‌ట్రాసెల్యులర్‌ వాతావరణానికి సంబంధించిన జీవరసాయన, జీవభౌతిక లక్షణాలు, కొన్ని రకాల పాలీపెప్టైడ్లను జోడించడం ద్వారా చిన్నపాటి క్లోమాలను తయారుచేశారు. క్లోమమే కాకుండా.. పేగు, ఎండోమెట్రియల్‌ కణజాలానికి సంబంధించిన నమూనాలను వృద్ధి చేసేందుకూ ఈ జెల్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. రోగి నుంచి సేకరించిన క్లోమ క్యాన్సర్‌ కణాల సాయంతోనూ ఈ సూక్ష్మ అవయవాలను తయారుచేసేందుకూ ఈ విధానం అక్కరకొస్తుందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని