close

ప్రధానాంశాలు

విమానయానాల ఎత్తులో మార్పుతో భూతాపం చిత్తు!

లండన్‌: భూతాపానికి విమానయానాలు కూడా కారణమవుతున్నాయి. అయితే చిన్నపాటి సర్దుబాటుతో దీన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. విమాన ఇంజిన్‌ నుంచి వెలువడే వేడి వాయువులు.. వాతావరణంలోని చల్లటి, తక్కువ పీడనంతో కూడిన గాలిని తాకినప్పుడు ఆకాశంలో తెల్లటి పొగ చారలు (కాంట్రెయిల్స్‌) ఏర్పడతాయి. వీటిలో నల్ల కర్బన రేణువులూ ఉంటాయి. చాలావరకూ కాంట్రెయిల్స్‌ కొన్ని నిమిషాలే ఉంటాయి. కొన్ని మాత్రం విస్తరించి, ఇతర కాంట్రెయిల్స్‌, సిర్రస్‌ మేఘాలతో కలుస్తాయి. ఫలితంగా ‘కాంట్రెయిల్‌ సిర్రస్‌’ మేఘాలు ఏర్పడి, ఎక్కువసేపు ఉండి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు కంప్యూటర్‌ సిమ్యులేషన్లను నిర్వహించారు. 1.7 శాతం విమానాల గగనవిహార ఎత్తును సాధారణ ఎత్తుకు రెండు వేల అడుగుల మేర పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తే లోహ విహంగాలతో ముడిపడిన వాతావరణ మార్పులు 59 శాతం మేర తగ్గుతాయని తేలింది. దీనికితోడు విమానాల్లో పర్యావరణ అనుకూల ఇంజిన్లను ఉపయోగిస్తే వాటి నుంచి వెలువడే పొగ వల్ల కలిగే హాని 90 శాతం తగ్గుతుందని వెల్లడైంది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.