close

ప్రధానాంశాలు

హృద్రోగులూ జాగ్రత్త!

 ఊపిరితిత్తుల్లోనే వైరస్‌ తిష్ఠ
 రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోతుంది
 గుండె, ఇతర భాగాలపై ప్రభావం
ప్రముఖ గుండె శస్త్ర నిపుణులు, పరిశోధకులు డా. సజ్జా లోకేశ్వర్‌రావు

‘నోటి, ముక్కు తుంపర్లు(డ్రాప్‌లెట్స్‌) ద్వారా వ్యాపించే కరోనా వైరస్‌ గొంతు, స్వరపేటిక, శ్వాసకోశాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి తిష్ఠ వేస్తుంది. శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో ఇది అధిక ప్రభావం చూపుతుంది. వైరస్‌ బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అసలు దాని బారిన పడకుండా ఇంటికే పరిమితం కావడమే అతి పెద్ద ఔషధం’ అని ప్రముఖ హృద్రోగ నిపుణులు, గుండె శస్త్ర చికిత్సల పరిశోధకులు డాక్టర్‌ సజ్జా లోకేశ్వర్‌రావు సూచించారు. ఆయన మాటల్లోనే..
* ఊపిరితిత్తుల్లో ఆల్వివోలస్‌(చిన్న గదులు) వంటివి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను బయటకు, ఆక్సిజన్‌ను లోపలికి పంపిస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెంచుతాయి. కరోనా వైరస్‌ ఆల్వివోలస్‌లోని కణాలకు అతుక్కొని రెట్టింపవుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం పెరుగుతుంది.
* ఊపిరితిత్తుల పనితీరుపైనే శరీర వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ చేరేది ఇక్కడే. తర్వాత ఆక్సిజన్‌తో కలిపిన రక్తం గుండె ఎడమ భాగానికి చేరి కర్ణికలు, జఠరికల నుంచి బృహద్ధమని ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వెళుతుంది. కరోనా వైరస్‌ వల్ల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
* ఊపిరితిత్తుల నుంచి వైరస్‌ రక్తం ద్వారా శరీరంలోకి చేరితే అవయవాల్లో వాపు వస్తుంది. కరోనా లక్షణాల్లో ఒళ్లు నొప్పులు ఒకటి. ఈ వాపు గుండె కండరాలపై పడి వైరల్‌ మయోకార్డైటీస్‌కు దారి తీస్తుంది.
* ఇలాంటి ద్రవంతో ఊపిరితిత్తులు నిండిపోవడం వల్ల ఆక్సిజన్‌ పీల్చుకోలేం. కార్బన్‌డయాక్సైడ్‌ బయటకు రాదు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. బయట నుంచి కృత్రిమ శ్వాస అందించాల్సి వస్తుంది.
* వైరస్‌ అనేది సాధారణమే అయినా, కొవిడ్‌-19లో ఆర్‌ఎన్‌ఏలో మార్పు వల్ల వేగం పెరుగుతుంది. వైరస్‌ సోకిన వ్యక్తిపై అధిక ప్రభావం చూపుతుంది. హృద్రోగ ఇతర దీర్ఘకాలిక  సమస్యలు ఎదుర్కొనే వారు మరింత జాగ్రత్తలు పాటించాలి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.