close

ప్రధానాంశాలు

లాక్‌డౌన్‌లో ఏంచేశారు?

ముందుకు సాగిపోవడమే

నవలా రచయితగా, వ్యక్తిత్వ వికాస అక్షర శిల్పిగా చెరగని ముద్ర వేసుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్‌. ఆయన నవలల ఆధారంగా సినిమాలూ వచ్చాయి. నిత్య రచనా పథికుడు యండమూరి లాక్‌డౌన్‌లో ఎలా గడిపారు? ఆయన మాటల్లోనే...

పాండిచ్చేరి అరవిందుల సూక్తులు చదివాను. వాటిలో కొన్ని ఆకర్షించాయి. ‘‘ప్రస్తుతం ఉన్న జీవన, ఆలోచనా విధానాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అంతకన్నా బాగా బతకడం కోసం ఏదైనా మార్గం ఉన్నా అనుసరించరు. ఆ బాధల్లోనే కొనసాగడానికి ఎన్ని రకాల వాదనలు కావాలో అన్నీ సమకూర్చుకుంటారు’’ అంటారు అరవిందులు.

అవి కదిలించాయి
ప్రస్తుతం అగ్ని మహాపురాణం చదువుతున్నాను. ఇందులో నిత్య లయం, బ్రహ్మలయం, ప్రాకృత లయం, ఆత్యంతిక లయం అనే నాలుగు ప్రళయాల గురించి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ‘భయం’ అనే సినిమాకు మాటలు రాస్తున్నాను. కొత్త దర్శకుడు తీస్తున్నాడు. ఒక నవల కూడా రాస్తున్నా. కరోనా కల్లోల్లాన్ని తలచుకుంటే జాన్‌ మిల్టన్‌ గుర్తొస్తున్నాడు. కళ్లు పోయాకే ఆయన ‘పారడైజ్‌ లాస్ట్‌’ రాశాడు. మనిషికి కళ్లు స్వర్గం లాంటివి. వాటిని కోల్పోవడమే పారడైస్‌ లాస్ట్‌. జ్ఞానం అంటే తీరని కష్టాల గురించి ఆలోచించటం మానేసి, తీరే కష్టాలకు పరిష్కారం కనుక్కోవడం అంటాడు మిల్టన్‌. కష్టాలొచ్చినా అవన్నీ తాత్కాలికమన్న విషయాన్ని గుర్తించి సాగిపోవడమే. లాక్‌డౌన్‌ ఎత్తేసి, అందరూ బయటికి రావచ్చు అని ప్రభుత్వం చెబితే మనకి ఆనందం కలిగింది. ఆ ఆనందం నిరంతరమైతే బాగుంటుంది.

 

మరిన్ని విషయాలు... మరింత మంది ప్రముఖుల విశేషాలు...  teluguvelugu.in లో.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.