close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్నను చేరలేక.. తమ్ముడిని చూడలేక!

రక్కసి నుంచి ‘రక్ష’ కోరుతున్న సోదరీమణులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఏడు సముద్రాల ఆవల ఉన్నా ప్రతి ఏటా రాఖీ పండగకి సోదరులను కలవాలనేది అక్కాచెల్లెళ్ల ఆశ. ఇప్పుడు ‘అన్నను చేరలేం.. తమ్ముడిని చూడలేం..ఎవరి ఇంట్లో వాళ్లు బందీలవ్వాల్సిన పరిస్థితి’ అంటూ పలువురు వాపోతున్నారు. ఊహ తెలిసిన నుంచి అన్నదమ్ముల బాగు కోరి కట్టే రక్షాబంధనం ఈ ఏడాది చాలామందికి దూరమైంది. వైరస్‌ వల్ల సోదరులను, సోదరిలను కోల్పోయిన వారూ ఉన్నారు. ఇంకొందరు క్వారంటైన్‌లో ఉండి తోబుట్టువులను చేరలేక బాధపడుతున్నారు.

నేను వారి దగ్గరికి వెళ్లలేను: - ఓ సోదరి, రాంపల్లి

నాకు ఇద్దరు అన్నలు. వివాహమై కన్నవారిళ్లు విడిచి వచ్చినా ఇక్కడ కూడా వారే నా బలం. ఊహ తెలిసినప్పటి నుంచీ ఇప్పటివరకు ప్రతి రాఖీ పండగకి తప్పకుండా వారికి రక్ష కట్టేదాన్ని. ఈసారి ఆ అవకాశం లేదు. 14 రోజుల క్రితం మా మామ కరోనాతో చనిపోయారు. నేనూ కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. సోదరులు మలక్‌పేటలో ఉంటారు. అక్కడి వరకు వెళ్లలేను.. వారు నా దగ్గరికి వచ్చి వెళ్లే పరిస్థితి లేదు. రక్షాబంధన్‌ రోజు గుర్తొస్తేనే ఏడుపొస్తోంది. మా జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

నలభై ఏళ్ల బంధం దూరమైంది: - మహిళ, రాణిగంజ్‌

నేను నలభై ఏళ్లుగా మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. ప్రతి ఏటా ఎక్కడున్నా ఈరోజు తప్పకుండా కలిసేవాళ్లం. ఎంత ఇబ్బందికర పరిస్థితులున్నా తనకి కట్టి వచ్చేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం లేకపోయింది. ఇక ఎప్పుడూ రాదు. ఎందుకుంటే కరోనా మహమ్మారి వల్ల అన్నయ్య చనిపోయారు. ఉన్న ఒక్క సోదరుడినీ అది దూరం చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.