close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతు హృదయపు తడి

నీరందక పంట గొంతెండుతుంటే రైతు గుండె నీరవుతుంది. భగీరథ ప్రయత్నమే మొదలవుతుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు కొసన ఐలయ్య. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ ప్రాంతంలో యాసంగి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం నుంచి అక్కడక్కడ నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐలయ్య నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. పది రోజుల నుంచి భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోరుబావి నీరు రెండెకరాలకే సరిపోతోంది. మిగతా రెండెకరాల్లో వరిని కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. రోజుకు పది ట్రిప్పుల వరకు ట్యాంకర్‌ ద్వారా అందిస్తున్నా ఒక ఎకరానికే నీటిని అందించగలుగుతున్నానని చెప్పారు.  

- న్యూస్‌టుడే, ఆత్మకూరు(ఎం)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు