వీడియో పాఠం నిడివి పది నిమిషాలే!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడియో పాఠం నిడివి పది నిమిషాలే!

దీక్ష యాప్‌లో సంస్కరణలు

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు చెప్పేవాటితో పాటు పుస్తకాలలోని క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో ఆయా పాఠ్యాంశాలపై మరింత వివరణ ఇచ్చేందుకు ఉద్దేశించిన దీక్ష యాప్‌లో సంస్కరణలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పుస్తకంలో ముద్రించిన కోడ్‌ను స్కాన్‌ చేస్తే యూట్యూబ్‌ ద్వారా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండేది. కరోనా కన్నా ముందు నుంచే ఈ విధానాన్ని ప్రారంభించిన విద్యాశాఖ, కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకు పది నిమిషాల కన్నా తక్కువ వ్యవధి ఉండే పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. సెల్‌ఫోనులో డాటా పెద్దఎత్తున వినియోగం కాకుండా విద్యార్థికి అవసరమైన సమాచారాన్ని సూటిగా క్లుప్తంగా అందించాలని నిర్ణయించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే పాఠ్యాంశం తాలూకు సమాచారం 7-10 నిమిషాలలోపు అందించేలా రూపొందిస్తోంది. మరీ పెద్ద పాఠ్యాంశమైతే రెండు భాగాలు చేయనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు