రోడ్డెక్కితేనే సిగ్నల్స్‌..!
close

ప్రధానాంశాలు

రోడ్డెక్కితేనే సిగ్నల్స్‌..!

ఈ చిత్రంలో ఉన్న వారంతా ఏదో సమావేశం కోసమో ఏదైనా చర్చ కోసమో వచ్చి ప్రారంభం కాలేదని ఇలా సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారనుకుంటే పొరపాటే. ప్రపంచమంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తుంటే.. ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక గ్రామాలు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా అందక బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నాయి. ప్రతి ప్రభుత్వ పథకానికి సెల్‌ఫోన్‌ నంబరుతో అనుసంధానం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో సిగ్నల్స్‌ అందక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని 13 గ్రామాల ప్రజలు సుమారు ఏడు వేల మంది సెల్‌ఫోన్‌ మాట్లాడాలనుకుంటే ఇలా చిఛ్‌దరి ఖానాపూర్‌లోని రోడ్డెక్కాల్సిందే. ఇక్కడ కూడా ఓ ప్రైవేట్‌ కంపెనీకి సంబంధించిన సిగ్నల్స్‌ మాత్రమే వస్తాయి. ఈ పరిస్థితిని చూసే ప్రభుత్వం ఇక్కడ కొన్ని పథకాలకు సంబంధించి సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానం లేకున్నా లబ్ధి కలిగేలా ఉత్తర్వులిచ్చింది.

  - ఈనాడు, ఆదిలాబాద్‌ - న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని