* నడుము, రెక్క గూడు పూర్తిగా గోడకు తాకేలా నిటారుగా నిలబడాలి. అనంతరం తలను గోడ వైపునకు నెమ్మదిగా వెనక్కి లాక్కోవాలి. అయితే తలను వెనక్కి వంచకూడదు. కొద్దిసేపు అలాగే ఉన్నాక.. వీలైనంతవరకు అదే భంగిమలో ముందుకు నడవటానికి ప్రయత్నించాలి. |

* ముందుగా కుర్చీలో నిటారుగా కూచోవాలి. వీపు భాగం పూర్తిగా కుర్చీకి ఆనించి ఉంచాలి. కొన్ని సెకండ్ల పాటు అలాగే కూచోవాలి. ఈ సమయంలో వీలైనంతవరకు వెన్ను ముందుకు వంగకుండా చూసుకోవాలి. కుర్చీలో కూచున్న ప్రతిసారీ ఇలా కనీసం మూడు సార్లు చేస్తుండాలి.
|

* కుర్చీలో విశ్రాంతిగా కూచొని ముందుకు వంగి, చేతులతో పాదాలను పట్టుకోవాలి. అనంతరం వెన్నెముక ముందుకు వంగకుండా చూసుకుంటూ నెమ్మదిగా లేస్తూ.. తిరిగి యథాస్థితికి రావాలి. కొద్ది సెకండ్ల పాటు అలాగే నిటారుగా కూచోవాలి. అయితే.. రక్తపోటు తక్కువగా గలవారు దీన్ని చేయకూడదు.
|

* ఉదయం పూట నిద్ర లేచాక 5 నిమిషాల సేపు వెల్లకిలా పడుకోవాలి. తల, మెడ వెనక్కి వాలిపోకుండా దిండు పెట్టుకోవాలి. కండరాలన్నింటినీ వదులుగా ఉంచుతూ.. గురుత్వాకర్షణ శక్తికి శరీరం తిన్నగా సాగేలా చూసుకోవాలి.
|

* మంచం లేదా చాప మీద బోర్లా పడుకోవాలి. చేతులు శరీరం పక్కనే ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా భుజాలను బిగుతుగా చేస్తూ దగ్గరకు లాక్కోవాలి. ఈ సమయంలో తలను, మెడను ఒకే రేఖలో తిన్నగా ఉంచాలి. కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉండాలి. అయితే నడుం భాగం పైకి లేవకుండా చూసుకోవాలి.
|

* కూచున్నప్పుడు లేదా నిలబడినప్పుడు నెమ్మదిగా చుబుకాన్ని వెనక్కి లాక్కుంటూ.. మెడ నిటారు స్థితికి వచ్చేలా చూసుకోవాలి. తలను మాత్రం వెనక్కి వంచకూడదు. ఐదు సెకండ్ల పాటు అలాగే ఉండి, తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ సమయంలో తల మునుపటిలాగా ముందుకు వంగిపోకుండా చూసుకోవటానికి ప్రయత్నించాలి.
|