close

రాశిఫలం

గ్రహబలం (జనవరి 19 - 25)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


మేషం 

విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలుంటాయి. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.


వృషభం

మనోబలంతో ముందుకు సాగండి. ప్రతి పనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. అశ్రద్ధ వహిస్తే అపారనష్టం వస్తుంది. అవసరాలకు ధనం ముందుగానే సమకూర్చుకోవాలి. మొహమాటం పనికి రాదు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

 


మిథునం

కార్యసిద్ధి ఉంటుంది. నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేయండి. అద్భుతమైన విజయం లభిస్తుంది. చురుకైన ఆలోచనా విధానం వల్ల మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. నిజాయతీ కాపాడుతుంది. ధనలాభం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గరాదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. సూర్య ఆరాధన శక్తినిస్తుంది.


కర్కాటకం 

శ్రమతో కూడిన విజయముంటుంది. పట్టుదలతో పనిచేస్తే లాభపడతారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయండి. అపోహలకు తావివ్వరాదు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవబలం రక్షిస్తోంది. భూ, గృహ యోగాలు అనుకూలిస్తాయి. ఎదురుచూస్తున్న ఒక ఫలితం ఆనందాన్నిస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఈశ్వర ఆరాధన శ్రేష్ఠం.


సింహం

శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. అదృష్టయోగముంది. వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది. ఆత్మబలంతో అభివృద్ధి సాధిస్తారు. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. విష్ణునామస్మరణ శక్తినిస్తుంది.


కన్య

ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. కష్టాల నుంచి బయటపడతారు. మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. సంకల్పసిద్ధి ఉంది. దేనికీ తొందరవద్దు. వ్యాపారంలో ఇబ్బందులు రానీయకండి. ప్రతి పనినీ స్వయంగా పర్యవేక్షించండి. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది.


తుల

అదృష్టయోగముంది. అన్నివిధాలా శ్రేష్ఠమైన కాలమిది. ముఖ్య కార్యాల్లో శుభఫలితముంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోండి. మొహమాటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దశదిశలా విస్తరించే అవకాశమిది. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. నలుగురికీ సహాయం చేసే శక్తి లభిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదిగే కాలమిది. ఆంజనేయస్వామిని దర్శించండి.


వృశ్చికం

అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. క్రమశిక్షణతో పనిచేసి ప్రశంసలను అందుకుంటారు. గురుభక్తి, చిత్తశుద్ధి మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వారం మధ్యలో స్వల్ప ఆటంకాలున్నాయి. పట్టువిడుపులతో వ్యవహరిస్తే ఏ సమస్యా రాదు. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి.


ధనుస్సు

వ్యాపార లాభముంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. సరైన ప్రణాళిక ద్వారా అనుకున్నది సిద్ధిస్తుంది. నిరుత్సాహపడరాదు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. పట్టుదలతో పనులను పూర్తిచేయండి. కలహాలకు దూరంగా ఉండండి. అభీష్టసిద్ధి ఉంది. విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. శాంతచిత్తంతో ఆలోచించాలి. లక్ష్మీదేవిని స్మరించండి.


మకరం

చక్కని కార్యసిద్ధి ఉంది. పట్టు సడలకుండా ప్రయత్నించండి. శ్రేష్ఠమైన శుభకాలం నడుస్తోంది. న్యాయపరమైన ఫలితం ఒకటి అనుకూలంగా ఉంటుంది. నిరంతర శ్రమతో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. భూలాభం ఉంది. సహనంతో వ్యవహరించాలి. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


కుంభం

విజయం వరిస్తుంది. తగినంత ప్రయత్నం చేయండి. అవసరాలకు సహాయం అందుతుంది. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్య వ్యక్తుల సూచనలు పనిచేస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అధికార యోగముంది. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఇబ్బందుల్ని అధిగమించండి. వారాంతంలో ఒక మంచి వార్త వింటారు. ఇష్టదేవతా స్మరణ మంచిది.


మీనం

ధనలాభముంటుంది. ఆత్మబలంతో పనులు ప్రారంభించండి. పూర్వపుణ్యం కాపాడుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సూచనలతో కార్యసిద్ధి ఉంటుంది. నిండైన మనసుతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి.  సమష్టి కృషితో మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.