close

‘ఆక్స్‌ఫర్డ్‌’లో అంబారీ..!

ఎవరైనా ‘హాయ్‌ షిమిక్‌’ అని పిలిస్తే ఇదేం కొత్తపేరు అని బిత్తరపోయేరు. అలసిపోయి హోటల్‌కు వెళ్లిన తరవాత కాసింత ‘చిలాక్స్‌’ అవుదాం అని మీ స్నేహితుడు అంటే... అది ‘చిలాక్స్‌’ కాదురా ‘రిలాక్స్‌’ అంటూ తిట్టిపోసేరు. ఎందుకంటే... అవన్నీ... 2019లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తించిన కొత్త పదాలు.

క్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ... ప్రతి సంవత్సరం ఎన్నో పదాల్ని సేకరిస్తుంటుంది. 2019లోనూ పద్నాలుగు వందల కొత్త పదాల్ని సేకరించింది. ఇందులో ‘టాలీవుడ్‌’తోపాటు మరెన్నో భారతీయ భాషల పదాలు ఉన్నాయి.

Chillax: ఎవరైనా కాస్త గట్టిగా, కోపంగా మాట్లాడుతుంటే ‘చిల్‌’ అంటూ కూల్‌గా ఉండమని చెబుతాం. అలసట నుంచి ఉపశమనం పొందడానికి ‘రిలాక్స్‌’ అంటుంటాం. ఈ రెండూ కలిపే ‘చిలాక్స్‌’ అయ్యింది. అంటే ఎలాంటి ఆలోచనలూ చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడమే ‘చిలాక్స్‌’.
Fantoosh:ఫాంటూష్‌ పేరు వినగానే ఎక్కువ మందికి దుస్తులే గుర్తుకొస్తాయి. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తిం చిన ప్రకారం ఈ పదాన్ని ఇప్పుడు ఫ్యాన్సీ, ఫ్యాషనబుల్‌, స్టైలిష్‌, సఫిస్టికేటెడ్‌, ఎక్జోటిక్‌ తదితర అర్థాలు వచ్చే సందర్భాల్లో ప్రయోగించొచ్చు.

Satta: దేశంలో చట్టవిరుద్ధంగా పేకాట, మట్కాలాంటి జూద కార్యకలాపాలు అడ్డగోలుగా కొనసాగుతున్నాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో సత్తా అని పిలుస్తారు. అలాంటి మోసపూరిత ఆటలకు ఆక్స్‌ఫర్డ్‌ పెట్టిన పేరే... సత్తా.

Presser: ఇప్పటి వరకు మనం ప్రెస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌, మీట్‌ ద ప్రెస్‌ అన్న పదాలు విన్నాం. ఇక నుంచి ప్రెసర్‌ అన్న పదాన్నీ వినబోతున్నాం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ పత్రికా సమావేశాన్ని ‘ప్రెసర్‌’గా గుర్తించింది.

Brahma: బ్రహ్మ... సృష్టికర్త. ప్రస్తుత డిక్షనరీలోనూ బ్రహ్మ పదానికి అదే అర్థముంది. తాజాగా బ్రహ్మ అంటే... ఆనందంగా ఉండే, ఆకట్టుకునే, అందమైన వ్యక్తి అని గుర్తించారు.


మరికొన్ని పదాలు

Schmik: అందమైన, చురుకైన, చక్కనైన; Ayuh, yayus: అవును; Bae: స్నేహితుడు లేదా స్నేహితురాలు; Jozi: జోహెన్స్‌బర్గ్‌ సంక్షిప్త పేరు; Kanna: దక్షిణ ఆఫ్రికాలో పెరిగే ఓ పువ్వు; People kind:మానవత్వంగల మనుషులు; Twittering: ట్విటర్‌లో పోస్టు చేసే విధానం; Angel faced: దేవతలాంటి ముఖమున్న యువతి/మహిళ, అందమైన స్త్రీ; Bull Rider: ఎద్దుల బండి నడిపే వ్యక్తి; Easy breezy: సులభమైన, సౌకర్యవంతమైన, (గాలి తగిలేటువంటి); Fakeable: అవాస్తవమైన; Fakeness: కపటమైన, మోసపూరితమైన; Journey cake: మొక్కజొన్న పిండితో తయారు చేసిన కేక్‌; Micro finance: రుణాలను అందించే చిన్న ఆర్థిక సంస్థ; Sala: నివసించడానికి వీలున్న చిన్న గది; Chomper: అత్యాశగా తినే వ్యక్తి/జంతువు.


AMBARI: ఏనుగుపై ఏర్పాటుచేసే పందిరి వంటి నిర్మాణాన్ని అంబారీ అంటారు. మైసూరులో దసరా రోజున అంబారీలో చాముండేశ్వరీ మాతను ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. ఈ అంబారీని ఇప్పుడు ‘ఏనుగుపెనౖ ఏర్పాటుచేసే పందిరి’ అంటూ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తించడం గమనార్హం.


GYM BUNNY: శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి నేటి యువత ఎక్కువగా జిమ్‌ బాట పడుతోంది. అందులోనే ఎక్కువ సమయం గడిపేవారూ చాలామందే ఉంటారు. అలాంటి వారికి ఆక్స్‌ఫర్డ్‌ కొత్తగా ‘జిమ్‌ బన్నీ’ అని నామకరణం చేసింది.


TOLLYWOOD:  తెలుగు సినీ పరిశ్రమను టాలీవుడ్‌ అని పిలుస్తాం. ఈ పదాన్ని ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తించింది.


DRAGON FRUIT: డ్రాగన్‌ ఫ్రూట్‌లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మన దగ్గర కూడా పండుతున్న ‘డ్రాగన్‌ఫ్రూట్‌’ ఇప్పుడు ‘ఆక్స్‌ఫర్డ్‌’నూ ఆకర్షించింది!


E-BIKE:విద్యుత్తు వాహనాలను ఈ-బైక్‌లుగా పిలుస్తున్నారు. వీటికి ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తింపు లభించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.