close

రాశిఫలం

గ్రహబలం (ఏప్రిల్‌ 4 - ఏప్రిల్‌ 11)

డా।। శంకరమంచి శివ‌సాయి శ్రీనివాస్


బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుతారు. పట్టుదలతో విజయం సాధిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.విబేధాలకు తావివ్వకండి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సూర్యస్తుతి శుభకరం.


అదృష్టయోగం ఉంది. ఉత్సాహంతో పనిచేయాలి. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో అవగాహనాలోపం లేకుండా చూసుకోవాలి. అవసరానికి ఆదుకునేవారుంటారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. అపార్థాలకు తావివ్వకండి. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఇష్టదేవతా నామస్మరణ శుభకరం.


మిశ్రమ వాతావరణం ఉంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.  అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్థిరాస్తి  కొనుగోలు వ్యవహారం కలిసి వచ్చినప్పటికీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభకాలం. పట్టుదలతో లక్ష్యాలను చేరతారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఊహించిన ఫలితాలు అందుకుంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. అదృష్టయోగం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తలపెట్టిన కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మేలు జరుగుతుంది.


శుభఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్దికి సంబందించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.


గొప్ప శుభకాలం. మొదలుపెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త  మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈశ్వరాధన శక్తిని ఇస్తుంది.


అదృష్టయోగం ఉంది. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులలో ముందుకు వెళతారు. ఆర్దిక విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అపార్ధాలకు తావివ్వకుండా చూసుకోవాలి. వారాంతంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా శ్రమించండి. మంచి ఫలితం ఉంటుంది. విష్ణు ఆరాధన మంచిది.


మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత చాలా అవసరం.   ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. అనుభవజ్ఞులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. తొందరపాటు వద్దు. సమయస్పూర్తి తో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభప్రదం.


ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయులతో సంతోషకరంగా కాలం గడుపుతారు. ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అవసరానికి తగిన అందుతుంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. కలహాసూచన ఉంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.


ఆర్ధికంగా బలపడతారు. లక్ష్యాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన శుభప్రదం


దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. గొప్ప ఫలితాలు సొంతం అవుతాయి. చేపట్టిన పనులు శాశ్వత విజయంతో పాటు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కొందరి సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది .  ప్రయాణాలు అనుకూలిస్తాయి. శాంతి లభిస్తుంది. సూర్యస్తుతితో మేలు జరుగుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.