close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (మే 24 - 30)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ధైర్యంగా వ్యవహరిస్తే త్వరగా విజయం లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. ప్రయత్నం చాలా బలంగా ఉండాలి. ఏకాగ్రత లోపించకుడా చూసుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితముంటుంది. అపార్థాలకు తావివ్వకూడదు.  మనోబలం అన్ని సమస్యలకూ పరిష్కారాన్ని చూపుతుంది. ఓ శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యస్తుతి మేలుచేస్తుంది.


ఆర్థిక ప్రగతి అనుకూలం. కోరిక నెరవేరుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదృష్ట కాలం. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. సమష్టి కృషి విజయాన్నిస్తుంది. ఆవేశం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది.


కాలం అనుకూలంగా లేదు. ఆలోచించి అడుగేయాలి. ఆర్థికంగా మిశ్రమ కాలమిది, వ్యయం పెరిగే సూచన ఉంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రశాంతచిత్తంతో ఆలోచించాలి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ముఖ్యుల సలహాలు తీసుకోవాలి. వాగ్వాదాలకు అవకాశముంది. లక్ష్మీదేవి స్మరణ మంచిది.


చక్కని శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఎటుచూసినా లాభమే గోచరిస్తోంది. అదృష్ట యోగముంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితముంటుంది. గతంలో జరిగిన లోపాలను సరిచేసుకుంటారు. వ్యాపారంలో బాగా కలసివస్తుంది. స్వల్ప ఆటంకాలున్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ధ్యానం శుభప్రదం.


మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. సొంత నిర్ణయాలు మేలుచేస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగబలం అనుకూలం. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంటుంది.
అవరోధాలు తొలగుతాయి. కలహాలకు తావివ్వరాదు. వారం చివర శుభం జరుగుతుంది. ఇష్టదేవతాస్మరణ కార్యసిద్ధినిస్తుంది.


మంచి కాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్నిస్తాయి. క్రమంగా పైకి వస్తారు. కుటుంబసభ్యుల సలహాలు మేలుచేస్తాయి. ఇబ్బందులనుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆదిత్యహృదయం శుభాన్నిస్తుంది.


ఆర్థికాంశాలు బాగున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. మనసుకు తగినంత విశ్రాంతి అవసరం. పనిచేసే ముందు దగ్గరివారితో సంప్రదించండి. ఉద్యోగ సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మొహమాటం లేకుండా మాట్లాడాలి. కష్టాలనుండి బయట పడతారు. వారాంతంలో పనులు పూర్తవుతాయి. నవగ్రహస్తోత్రం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


మనోబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. వ్యాపారంలో కొంత మేలు జరుగుతుంది. తెలియని సమస్య ఒకటి ఎదురవుతుంది. ఆందోళన అక్కర్లేదు. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ఎవరితోనూ గొడవపడరాదు. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది.


అద్భుతమైన విజయాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలుంటాయి. గత వైభవం సిద్ధిస్తుంది. అపోహలు తొలగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆగిన పనులు తిరిగి మొదలు
పెడతారు. అధికారుల ప్రశంసలుంటాయి. ధనయోగం ఉంది. సంతోషం కలిగించే వార్తలు వింటారు. విష్ణుస్మరణ శుభాన్నిస్తుంది.


ధనలాభం సూచితం. కష్టపడి పని చేయండి. గొప్ప భవిష్యత్తు ఉంటుంది. అనవసర ఖర్చు చేయవద్దు. సంకల్ప శక్తితో విఘ్నాలను అధిగమిస్తారు. అందరితో సామరస్యంగా మాట్లాడాలి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. దగ్గరివారే ఇబ్బంది పెట్టే అవకాశముంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. శివాభిషేకం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది.
 


ఆర్థికాంశాలు మెరుగవుతాయి. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఉపద్రవాల నుంచి బయట పడతారు. కొందరివల్ల సమస్య వస్తుంది. ఆత్మీయుల ప్రమేయంతో పరిష్కారం లభిస్తుంది. మొహమాటానికి పోయి ఇబ్బందులు పడవద్దు. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. మీవల్ల కొందరికి మేలు జరుగు తుంది. దగ్గరివారితో విభేదాలు వద్దు. సూర్యారాధన మేలుచేస్తుంది.


శ్రేష్ఠమైన కాలమిది. చక్కటి ప్రణాళికలతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఏ పని తలపెట్టినా మేలు జరుగుతుంది. ఉద్యోగ ఫలాలు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బందేమీరాదు. అనుకున్నదే చేయండి. మధ్యలో ఆలోచనలను మార్చవద్దు. ఇష్టదైవస్మరణ మంచిది.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు