close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్కంఠభరితం

కీర్తి, శ్రుతి కవల పిల్లలు. న్యాయవాద వృత్తిలో స్థిరపడతారు. ఓ కేసు విషయంలో మాఫియా డాన్‌ రాణాకు సహకరించిన శ్రుతి అతడికి దగ్గరవడం కీర్తికి నచ్చదు. ఇంతలో శ్రుతిని రాణా హతమార్చాలనుకుంటున్నాడని కీర్తికి తెలుస్తుంది. ఆమెకి ఎవరు చెప్పారు, అసలు రాణా నిజస్వరూపం ఏమిటి, శ్రుతి ఏమైంది... అన్నది కథ. నవలంతా న్యాయవ్యవస్థ, సీబీఐ చుట్టూనే తిరుగుతుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రెస్‌మీట్‌, సీబీఐ బాసుల వ్యవహారం, నోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తంలో రెండువేల రూపాయల నోట్లు వెలుగు చూడడం వంటి యథార్థ సంఘటనలను కథలో ప్రస్తావిస్తారు. కీర్తి, శ్రుతి పాత్రల ద్వారా కథను ముందుకు నడిపించడం వల్ల కథలో మంచివాళ్లెవరు, కుట్రదారులెవరు అన్నది తెలియకుండా నవల ఉత్కంఠగా సాగుతుంది.

- శివప్రసాద్‌

నిఘా(నవల)
రచన: డాక్టర్‌ ప్రభాకర్‌ జైని
పేజీలు: 356; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


చిన్నారి కల

ద్నాలుగేళ్ల అమర్‌ కలలు కనీ కనీ చివరికి తన కోరికను అమ్మానాన్నలకు చెప్పేశాడు. చిన్నపిల్లాడివి, ఇప్పుడు కాదు పెద్దయ్యాక చూద్దాంలే- అన్నారు వాళ్లు. అయినా అమర్‌ ఊరుకోలేదు. వాళ్ళు డబ్బు ఇచ్చే పనిలేకుండా తానే ఓ పోటీలో సంపాదించుకున్నాడు. డబ్బు కూడా ఉంది కాబట్టి ఎవరెస్టు పర్వతాన్ని చూసి రావాలన్న తన కల నెరవేర్చుకోడానికి వెళ్తానన్నాడు. అమ్మానాన్నలను ఒప్పించి ఒంటరిగా ప్రయాణమయ్యాడు. ఆ సాహసయాత్రలో అమర్‌ నేర్చుకున్న పాఠాలేమిటీ, ఎవరెస్టు ఎక్కాలన్న అతడి కోరికకి ప్రేరణ ఏమిటీ, అనాథాశ్రమంలో ఉండే అమర్‌ నిజంగానే ఎవరెస్టు ఎక్కి వచ్చాడా... అన్నది తెలియాలంటే కథ చదవాల్సిందే. పిల్లల కలలూ మన స్తత్వాల చిత్రణలో బాలల హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన రచయిత్రి అనుభవం కనిపిస్తుంది.

- శ్రీ

అమర్‌ సాహసయాత్ర
రచన: వి.శాంతిప్రబోధ
పేజీలు: 80; వెల: రూ. 50/-
ప్రతులకు: ఫోన్‌- 9490746614


వచనకవిత్వం

రళమైన వచనంతో మనసుకు సూటిగా తాకేలా చెప్పిన కవిత్వమిది. ‘నా జోడెడ్ల బండే నాకు చైతన్యరథం- ఎన్ని జన్మలైనా రైతుగా పుట్టడమే నా సంకల్పం’ అని రైతు గుండె చప్పుణ్ని ఆవిష్కరించారు కవి. ‘అమ్మ చేతులు విరిసిన తామరపువ్వులు- వాటిని వాలనీయకు, వాడనీయకు. అవి అమృతహస్తాలు- బిడ్డలకు పవిత్ర లోగిళ్లు’ అంటూ అమ్మ చేతుల వైశిష్ట్యాన్ని వెల్లడించారు. ‘జీవనగమనంలో ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా, చివరకు గుప్పెడు బూడిద కాక తప్పదు- అనే తాత్త్విక కోణాన్ని బతుకు చిత్రానికి సమన్వయం చేశారు.   ‘అందర్నీ నమ్మేస్తాడు. అడుసులో అడుగేస్తాడు. కడుక్కోలేక జీవితాంతం ఛస్తాడు’ అంటూ అమాయకుల అగచాట్లను వివరించిన కవి ‘నీ మనస్సాక్షితో మనసు విప్పు. ఒక్కసారి మాట్లాడుకో...’ అని తేల్చి చెప్పేశారు.

- విద్వత్‌ శ్రీనిధి

అమ్మ... అమృతహస్తాలు..!
రచన: మొవ్వ రామకృష్ణ
పేజీలు: 215; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 9177423777


సంఘర్షణ కథలు

విత్వం ఎక్కువగా, కథలు తక్కువగా రాసిన రచయిత దాదాపు యాభై ఏళ్ల క్రితం రాసిన కథల్ని సంపుటిగా వెలువరించారు. నాటి సామాజిక పరిస్థితులే కథావస్తువులు. దోచుకోవటానికి వచ్చిన ఓ దొంగ ఆ పని మానేసి వృద్ధుడైన ఇంటి యజమానిని డాక్టరు దగ్గరకు మోసుకెళ్తాడు. అతనిలోని దానవత్వాన్ని మార్చిందెవరో చెప్పే కథ ‘మేల్కొన్న మానవత్వం’. సర్పంచి అకృత్యాన్ని నౌకరు చూశాడు. ఆ ‘రహస్యా’న్ని అతడు ఎంతకాలం దాచగలిగాడూ అంటే ఆ నేరం తనమీద పడనంతవరకే. నిజాయతీ పరుడైన వెంకట్రావు చావుబతుకుల మధ్య ఉన్న బిడ్డను కాపాడుకోడానికి మొదటిసారి లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ డబ్బుని చించి పోగులు పెట్టే పరిస్థితి ఎందుకొచ్చిందో ‘ప్రతిఫలం’ చెబుతుంది. పాత్రల మానసిక సంఘర్షణల చర్చతోనే తాను చెప్పదలచుకున్నది చెబుతారు రచయిత.

- సుశీల

ఆప్కారి సూర్యప్రకాశ్‌ కథలు
పేజీలు: 112; వెల: రూ. 110/-
ప్రతులకు: ఫోన్‌- 9848506964

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.