close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశి ఫలం

గ్రహబలం (మే 31 - జూన్‌ 6)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


సమయానికి పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం, ధనలాభాలు సిద్ధిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలున్నాయి. అసూయ పడేవారున్నారు. మితభాషణం రక్షిస్తుంది. కోరికలు నెరవేరతాయి. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. ఆంజనేయస్వామి స్మరణ మేలుచేస్తుంది.


అదృష్టవంతులు అవుతారు. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగఫలం శుభప్రదం. వ్యాపారం కలసివస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభాపాటవాలతో మెప్పిస్తారు. సకల సంపదలూ సిద్ధించే మంచి ప్రయత్నాలు చేస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


సమయోచితంగా వ్యవహరించాలి. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అవరోధాలు పెరుగుతాయి. దేనికీ తొందరపడరాదు. కొన్ని సంఘటనలు ఇబ్బందిపెడతాయి. సహనంతో ముందుకుసాగాలి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించాలి. వ్యాపార నష్టం వాటిల్ల కుండా చూసుకోవాలి. ద్వేషించేవారుంటారు. దగ్గరివారి సూచనలతో కొత్త ప్రయత్నాలు చేయండి. ఇష్టదైవస్మరణ శుభాన్నిస్తుంది.


ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అద్భుతమైన కార్యాచరణతో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలున్నాయి. ఆపదలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. బంధుమిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు. శివారాధనతో మనశ్శాంతి చేకూరుతుంది.


సంకల్పం కార్యసిద్ధినిస్తుంది. ఉత్సాహంతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. మంచి పనులను ప్రారంభించండి. వృద్ధిలోకి వస్తారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగం శుభప్రదం, వ్యాపారంలో అదృష్టం కలిసొస్తుంది. విష్ణు సహస్రనామాలు శ్రేయస్సునిస్తాయి.


మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభాలు జరుగుతాయి. అదృష్టప్రాప్తి ఉంటుంది. సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అవరోధాలు ఎదురైనా పనులు పూర్తవుతాయి. తోటివారికి సహాయపడతారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే శుభాలు జరుగుతాయి.


పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సకాలంలో పనిచేసి లాభపడతారు. ఆర్థికంగా శుభకాలం. గృహ, భూ లాభాలుంటాయి. ప్రయత్నాన్నిబట్టి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. ఎవరినీ ప్రత్యక్షంగా విమర్శించరాదు. శత్రుబలం పెరుగుతుంది. మృదుమధుర సంభాషణ అవసరం. దగ్గరివారితో విభేదాలు రానీయవద్దు. విష్ణుస్మరణ శాంతినిస్తుంది.


ఓర్పుతో పనులు ప్రారంభించాలి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. మోసం చేసేవారున్నారు. అపార్థాలకు అవకాశముంది.  ఉపద్రవాల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులతో చర్చించి పనిచేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. వారాంతంలో మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


విశేష శుభాలున్నాయి. పద్ధతి ప్రకారం పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. మనసులో అనుకున్నది సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థికస్థితి మెరుగవుతుంది.  సుఖసంతోషాలుంటాయి. కుటుంబసభ్యులతో ఆనందించే అంశాలున్నాయి. సర్దుకుపోయే ధోరణితో శాంతి లభిస్తుంది. ఇష్టదేవతా ప్రార్థన శుభాన్నిస్తుంది.


ముఖ్యమైన విజయం ఒకటి లభిస్తుంది. విఘ్నాలను పట్టుదలతో అధిగమించాలి. చెడు ఊహించకండి. దగ్గరివారితో సంప్రదించి పనులు పూర్తిచేయండి. అభిమానించేవారు పెరుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. వారాంతంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. లక్ష్మీస్తుతి శుభప్రదం.


విజయం దక్కుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. ఆర్థికాంశాలు బాగున్నాయి. అడుగడుగునా ఆటంకపరిచేవారున్నారు. వాదాలకు దూరంగా ఉండండి. ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి. పట్టువిడుపులతో ముందుకుసాగండి. ఒత్తిడి కలిగించే అంశాలున్నాయి. అభీష్టం నెరవేరుతుంది. శివారాధన కార్యసిద్ధినిస్తుంది.


అద్భుతమైన విజయం ఉంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. సాధించవలసిన వాటిపై స్పష్టత వస్తుంది. బాధ్యతలను జాగ్రత్తగా నెరవేర్చండి. అధిక వ్యయం సూచితం. మనసులో అనుకున్న పనికి కార్యరూపాన్నిస్తారు. పదిమందికీ ఆదర్శవంతులవుతారు. అదృష్ట యోగముంది. మీవంతు ప్రయత్నం చేయండి. లక్ష్మీ ఆరాధన అదృష్టాన్ని పెంచుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.