close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకాశంలో అల్పాహారం!

ముద్ర అందాలను చూస్తూ... అవి మోసుకొచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ... సరదాగా ఏం తినేసినా ఆ రుచి మధురంగానే అనిపిస్తుంది. ఇక, సముద్రం చెంతనే ఆకాశంలో విహరిస్తూ ఘుమఘుమలాడే పదార్థాలతో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే... ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు కదూ. అలాంటి అనుభూతినే అందిస్తోంది అమెరికాలోని వైల్డ్‌వుడ్‌ దగ్గర ఏర్పాటు చేసిన మోరేస్‌ పియర్స్‌ వాటర్‌ పార్క్‌. ఈ పార్క్‌ ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఇన్‌ ద స్కై’ పేరిట రంగులరాట్నంలో పర్యటకులకు అల్పాహారాన్ని అందిస్తుంది. ఇందులో కూర్చొని 150 అడుగుల ఎత్తునుంచి సముద్ర సోయగాలను చూస్తూ మన అభిరుచికి అనుగుణమైన అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచీ 10.45 గంటల వరకూ తిరిగే ఈ రంగులరాట్నంలో 40 క్యాబిన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాబిన్‌లో నలుగురు కూర్చోవచ్చు. క్యాబిన్‌ కింది భాగానికి రాగానే అక్కడి క్యాంటీన్‌ సిబ్బందికి మనకు నచ్చిన అల్పాహారాన్ని ఆర్డర్‌ చేసి తెప్పించి ఆకాశంలో పైపైకి వెళ్తూ తినేయొచ్చు. నింగిలో అల్పాహారం చేసే ఈ కాన్సెప్ట్‌ బాగుంది కదూ!



షోదయపు సూర్యకాంతిని తలపిస్తూ ఎరుపూ నారింజ వర్ణాల మిశ్రమంగా కనిపించే చెట్లూ... పక్కనే పచ్చటి తివాచీ పరచినట్టున్న నేలా... అద్దంలా మెరుస్తున్న నీటి కొలనూ... వాటి మధ్య ముచ్చటగా ఒదిగిపోయిన చిన్నచిన్న ఇళ్లూ... ఏ ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నుంచో జాలువారిన పెయింటింగ్‌ను తలపించే ఈ దృశ్యం, అమెరికాలోని వెర్మాంట్‌ ప్రాంతంలో మ్యాపల్‌ చెట్లు రంగులు మారే సమయంలోనిది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.