close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సముద్రంలో చేస్తారా... స్కూటర్‌ డ్రైవింగ్‌!

రోడ్ల మీద బైకులతో ఝాం... ఝాం... అంటూ దూసుకెళ్లడం అందరికీ అనుభవమే. మరి, సముద్రంలోపలి అందాలను చూస్తూ, హొయలుపోయే చేపల మధ్య స్కూటర్‌పైన అలా అలా వెళ్తుంటే ఆ సరదానే వేరుగా ఉంటుంది కదూ. అలాంటి అనుభూతినే కలిగిస్తుంది మారిషస్‌లోని ‘బ్లూ సఫారి సబ్‌మెరైన్‌ సంస్థ’. అక్కడి స్కూటర్లపైన ఎంచక్కా సముద్రంలోని నీళ్లలో  ప్రయాణిస్తూ, అందులో కనువిందు చేసే చేపలనూ, ఇతర జీవరాశులనూ చూడొచ్చు. ఆ స్కూటర్లపైన నాలుగు మీటర్ల లోతులో నలభై నిమిషాలపాటు ప్రయాణించొచ్చు. ప్రతి స్కూటర్‌ మీద పైలట్‌తోపాటు ఒకరు వెళ్లొచ్చు. మనకు అండర్‌ వాటర్‌ స్కూటర్‌ డ్రైవింగ్‌ వస్తే పైలట్‌ అవసరం లేకుండా మరొకరిని వెంట తీసుకెళ్లొచ్చు కూడా. మధ్యమధ్యలో తారసపడే చేపలతో ఫొటోలూ, వీడియోలూ తీసుకొని మన ఆనందాన్నీ, అనుభవాన్నీ ఇతరులతోనూ పంచుకోవచ్చు.


పనస జీ 52 కిలోలు!

పండ్లలోకెల్ల భారీ పండు ఏదీ అంటే... వెంటనే ‘పనస’ అని సమాధానం వస్తుంది. సాధారణంగా ఈ పండు పది నుంచీ పదిహేను కిలోల వరకూ బరువు ఉంటుంది. మరి కేరళలో అంతకుమించి బరువుగల పనస పండింది తెలుసా... కేరళలోని కప్పట్టుమల గ్రామంలోని ఓ ప్రైవేటు పనస తోటలో 117 సెంటిమీటర్ల పొడవూ, 77 సెంటిమీటర్ల చుట్టుకొలతతో 52.360 కిలోల బరువు ఉన్న పనస పండు పండింది. ఈ పండు ఇప్పుడు దేశప్రజలను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలోని పుణెలో 42.73 కిలోల బరువూ,  57 సెంటిమీటర్ల పొడవుతో పండిన పనస పండే ప్రపంచంలోకెల్లా బరువైన పండుగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఆ రికార్డును ‘కప్పట్టుమల పనస పండు’ బద్దలు కొట్టినట్లయింది. ‘పుణె పనస’ను మించిన బరువు ఉన్న ఈ పండును అత్యంత బరువైనదిగా గుర్తించాలంటూ ఆ ప్రాంత అధికారులు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు సమాచారం కూడా పంపించారట.


ఇది అవతార్‌ రెస్టరెంట్‌!

త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘అవతార్‌’ సినిమా సృష్టించిన సంచలనం ఇంతాఅంతా కాదు. అటవీ తెగకు చెందిన మనుషులు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి మనుషుల పోలికలతోనే చెన్నైలో  ‘అవతార్‌’ రెస్టరెంట్‌ ప్రారంభమైంది. భోజనప్రియులను ఆకట్టుకోవడానికి నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఎన్నో థీమ్డ్‌ రెస్టరెంట్లు ఏర్పాటవుతున్నాయి. అట్లాగే చెన్నైలో ఏర్పడిన ఈ రెస్టరెంట్‌- ‘అవతార్‌ పురుషుల’తో పోలిన బొమ్మల మధ్య భోజనం చేసే అవకాశాన్ని  కల్పిస్తుంది! ఇంకెందుకు ఆలస్యం... మీరూ వెళ్లి, వారి మధ్య భోజనం చేసి రండి!


ఫైర్‌ ఇంజిన్లకో మ్యూజియం

క్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అట్లాగే, ఇంగ్లండ్‌లో ఓ వ్యక్తికి ఫైర్‌ ఇంజిన్లను సేకరించడమంటే మహాఇష్టం. అక్కడి లింకన్‌షైర్‌కు చెందిన స్టీవెన్‌ షిర్లే ఎయిర్‌ఫోర్స్‌(ఆర్‌ఏఎఫ్‌)లో ఫైర్‌ ఫైటర్‌గా పనిచేస్తున్నాడు. అధికారులు కాలంచెల్లిన ఫైర్‌ ఇంజిన్లను పక్కన పెట్టేయడాన్ని గమనించిన స్టీవెన్‌... వాటిని సేకరించాలని అనుకున్నాడు. అలా అతడు లింకన్‌షైర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో కాలం చెల్లిన ఫైర్‌ ఇంజిన్లను కొనుగోలు చేస్తూ భద్రపరచుకుంటున్నాడు. గత నలభై ఏళ్ల నుంచీ ఇప్పటి వరకూ అతడు 52 పాత ఫైర్‌ ఇంజిన్లూ, 3,500 మోడల్‌ ఫైర్‌ ఇంజిన్‌ బొమ్మలూ, మూడు వందల అగ్నిమాపక పరికరాలూ, మరో మూడు వందల హెల్మెట్లూ సేకరించాడు. వాటి కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కొనుగోలుచేసి ఫైర్‌ ఇంజిన్‌ మ్యూజియాన్నే ఏర్పాటు చేశాడు. అందులో కొంత మంది వాలంటీర్లను కూడా నియమించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందర్శకులకు వివరిస్తున్నాడు స్టీవెన్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.