close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అలా... పిల్లల్ని ఏడిపిస్తా...!

మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్‌ ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రల్ని ఎంచుకోవడంలో ముందుంటుంది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘పెంగ్విన్‌’లో విభిన్నంగా అలరించే కీర్తి జీవితంలో ఆసక్తికర విశేషాలివి...

అభిమాన తారలు

విజయ్‌, సూర్యలకు వీరాభిమానిని. చిన్నప్పుడు వాళ్ల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.


డ్రీమ్‌ రోల్‌

‘క్వీన్‌’లో కంగన, ‘కహానీ’లో విద్యాబాలన్‌లు పోషించిన పాత్రలు నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా అలాంటి రోల్స్‌ చేయాలనుంది.


బ్యూటీ సీక్రెట్‌

నీళ్లు ఎక్కువగా తాగుతా, ఉదయం లేవగానే యోగా చేస్తా. 


తొలి సంపాదన

కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేప్పుడు ఓ ఫ్యాషన్‌షోలో పాల్గొంటే పారితోషికంగా రూ.500 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. 


కష్టపడింది

మహానటి సమయంలో ప్రోస్థటిక్‌ మేకప్‌కి 4 గంటలూ, షూటింగ్‌ మరో ఏడెనిమిది గంటలూ పట్టేది. ఆ సమయంలో తినడానికీ, నవ్వడానికీ కూడా కుదిరేది కాదు. సావిత్రి అమ్మ జీవితం కాబట్టి కష్టమైనా ఇష్టంగానే నటించా.


ప్రేమలేఖ

ఒకసారి చెన్నైలో జ్యూవెలరీ షాపు ప్రారంభానికి వెళితే ఒకబ్బాయి వచ్చి చేతిలో డైరీ పెట్టి వెళ్లాడు. చూస్తే అందులో లవ్‌లెటర్‌తోపాటు తన ఫొటోలూ అడ్రస్‌ ఉన్నాయి. అవి చూసి ఎంత నవ్వుకున్నానో.


ఇష్టంగా తినేవి

దోశలు... ఇంట్లో ఉంటే అమ్మతో రోజూ అవే చేయించుకుని తింటా. చెన్నై సాంబారు ఇడ్లీ కూడా ఇష్టమే. 


సావిత్రితో పోలికలు

ఈత, కార్‌ రేసింగ్‌, క్రికెట్‌... ఆమెకి లాగే నాకూ చాలా ఇష్టం. అలానే నా కనురెప్పలు మడిచి పెట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం భలే సరదా. సావిత్రి అమ్మ కూడా అలానే చేసేవారని షూటింగ్‌ సమయంలో తెలిసింది.


మెచ్చిన సినిమాలు

‘జిందగీ నా మిలేగి దోబారా’, ‘రోమియో అండ్‌ జూలియట్‌’ సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. 


తీరిక వేళ

ఈత కొడతా... స్కూల్‌ రోజుల్లో నేను స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ని.


బలం

అమ్మానాన్నలూ, నాపైన నాకున్న నమ్మకం...


నటి కాకపోయుంటే

ఫ్యాషన్‌ డిజైనర్‌ అయి ఉండేదాన్ని. 


ఇష్టమైన కార్లు

ఫోర్డ్‌, జాగ్వార్‌ ఎక్స్‌జే... ఈ రెండు కార్లనీ నా సంపాదనతోనే కొనుక్కున్నా.


నచ్చిన ప్రదేశం

ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ని రాత్రిపూట చూడటం ఇష్టం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు