close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశి ఫలం

గ్రహబలం (జూన్‌ 28 - జులై 4)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


అన్నివిధాలా మంచి సమయం. ఆర్థికంగా అనుకూలం. ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారుంటారు. వారం మధ్యలో తెలియని ఖర్చు ఉంటుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మనశ్శాంతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి.


కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదం, వ్యాపారలాభాలున్నాయి. విఘ్నాలున్నా పని పూర్తి చేస్తారు. బంధువర్గం నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. పట్టువిడుపులతో వ్యవహరించండి. వారాంతంలో మేలు జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి స్మరణ శుభప్రదం.


ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. శ్రద్ధగా పనిచేయాలి. పొరపాటు జరగనీయవద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. సొంత నిర్ణయం పనికిరాదు. వారం మధ్యలో మంచి జరుగుతుంది. మొహమాటం వల్ల కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. అధికారులనుంచి ఒత్తిడి ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్త. నవగ్రహశ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


మనోబలంతో విజయాలు సాధిస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగపరంగా మిశ్రమకాలం. వ్యాపారంలో ఒడుదొడుకులుంటాయి. సొంత వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది. వారం మధ్యలో ఒక పని పూర్తి అవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. ఇష్టదేవతా ధ్యానంతో మనశ్శాంతి లభిస్తుంది.


అద్భుతమైన శుభ ఫలితం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. సహనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ఫలితం చేతిదాకా వచ్చి ఆగుతుంది. సకాలంలో పనిచేసి పెద్దల మెప్పు పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలుంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. లక్ష్మీధ్యానం శక్తినిస్తుంది.


కార్యసిద్ధి ఉంది. అదృష్ట ఫలాలు అందు తాయి. కాలం సహకరిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో సమస్య ఎదురవుతుంది. ఓర్పుతో పరిష్కరించండి. అపనిందలు మోపేవారున్నారు. ధనలాభం సూచితం. వారాంతంలో కార్యసిద్ధి ఉంటుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.


ధైర్యంగా పనులు మొదలుపెట్టండి. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రతిభతో ప్రశంసలు పొందుతారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒత్తిడి లేకుండా సంభాషించండి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. వారాంతంలో మంచి జరుగుతుంది. ఇష్టదేవతారాధన ఉత్తమం.


ఏకాగ్రతతో పనిచేస్తే విజయం వెంటనే వస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరండి. ఒత్తిడి లేకుండా ఆలోచించాలి. అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. వాదాలకు దూరంగా ఉండండి. వారాంతంలో కొంత మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు పారాయణం చేస్తే శుభం జరుగుతుంది.


పట్టుదలతో పనులను పూర్తిచేయాలి. ఆటంకాలున్నాయి. ఉపాయంతో బయటపడాలి. మిత్రుల సలహా తీసుకోండి. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ధననష్టం రాకుండా చూసుకోవాలి. ముందస్తు ప్రణాళికలతో ఫలితం ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మేలుచేస్తుంది.


మంచి సమయం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి.  ఇంటాబయటా మీదే పైచేయి అవుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కృషికి గుర్తింపు లభిస్తుంది. మీవల్ల కొందరికి సహాయం అందుతుంది. ఒత్తిడిని జయిస్తారు. శుభవార్తలు వింటారు. అన్నివిధాలా మేలు జరుగుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ఆర్థికంగా కలసవస్తుంది. ఒత్తిళ్లను జయిస్తారు. ఖర్చు పెరుగుతుంది. వారం మధ్యలో ఉద్యోగంలో ఒక సమస్య ఎదురవుతుంది. సమయస్ఫూర్తితో విజయం లభిస్తుంది. కోరుకున్న ఫలితం రావాలంటే బాగా కష్టపడాలి. ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. దేనికీ తొందరపడవద్దు. శాంత చిత్తంతో సమస్యలను పరిష్కరిస్తారు. శివారాధన ఉత్తమం.


అన్నివిధాలా శుభ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో కలసివస్తుంది. వ్యాపార లాభముంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకు  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అభీష్టసిద్ధి ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం చదివితే ప్రశాంతత లభిస్తుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.