close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇదే తెలు‘గత్తయ్యా’

అత్త: ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!
కోడలు: వస్తున్నా నత్తయ్యా!
అత్త: అత్తయ్యా అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా  అనకపోతే...
కోడలు: నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని ఉన్నారు, అబద్ధమాడ కత్తయ్యా! మైల పడిపోతారు.
అత్త: ఇప్పుడే మన్నావ్‌! కత్తయ్యా అనలేదటే! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా!
కోడలు: అయ్యో! నా ఖర్మకొద్దీ దొరికా రత్తయ్యా మీరు!
అత్త: మళ్ళీ ఇంకో కొత్త కూత! ఇప్పుడు రత్తయ్యా  అన్నావా లేదా?
కోడలు: అయ్యో! నా రాత! అది సంధి. మీరు తెలుగు సరిగా చదువుకోలే దత్తయ్యా!
అత్త: మరో మాయదారి కూత. దత్తయ్యా అట! వాడెవడు? అయ్యో! అయ్యో! నేను నీలాగ చదువుకోలేదని నన్ను నత్తయ్యా, కత్తయ్యా, రత్తయ్యా, దత్తయ్యా అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే! అబ్బాయిని ఇంటికి రానీ! చెబుతా నీ సంగతి!!!
కోడలు: అలా ఉడికి పోయి ఆయాసం తెచ్చుకోకండి. బీపీ పెరుగుతుంది. మీరనుకున్నవన్నీ ‘ఉకారసంధి’ వలన ఏర్పడిన పదాలత్తయ్యా!
అత్త: ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.