close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మబ్బుల్లో నడుద్దామా!

నేలపైన నిలబడి ఆకాశంలోని మబ్బులను చూస్తే బావుంటుంది. ఎప్పుడైనా విమానం  ఎక్కినప్పుడు కిటికీలోంచి పక్కనే మేఘాలు కనిపిస్తుంటే ఇంకా బావుంటుంది. కానీ ఆ మబ్బుల్లోనే మనం నడిస్తే! భలే ఉంటుంది కదా... ఇలాంటి అనుభవం కావాలంటే మలేషియాలోని లాంకావి ద్వీపానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడే ఉంది ఈ స్కై బ్రిడ్జ్‌. ఆ ద్వీపంలోని రెండు కొండల మధ్య దీన్ని భూమికి 100 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ బ్రిడ్జి దగ్గరకు చేరుకోవాలంటే కొండదాకా కేబుల్‌ కార్‌లో వెళ్లాలి. అక్కడ నుంచి నడుస్తూ బ్రిడ్జి మీద హాయిగా విహరించవచ్చు. అంత ఎత్తు నుంచి చూస్తుంటే చుట్టూ ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయట! 125 మీటర్ల పొడవుండే దీని చివర్లో ఒక వ్యూపాయింట్‌ కూడా ఉంది. అక్కడ కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఈ అందమైన అనుభూతి కోసం ఏటా వేలాదిమంది పర్యటకులు ఇక్కడికి వస్తుంటారట.


ఉషోదయపు సూర్యకాంతిని తలపిస్తూ ఎరుపూ నారింజ వర్ణాల మిశ్రమంగా కనిపించే చెట్లూ... పక్కనే పచ్చటి తివాచీ పరచినట్టున్న నేలా... అద్దంలా మెరుస్తున్న నీటి కొలనూ... వాటి మధ్య ముచ్చటగా ఒదిగిపోయిన చిన్నచిన్న ఇళ్లూ... ఏ ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నుంచో జాలువారిన పెయింటింగ్‌ను తలపించే ఈ దృశ్యం, అమెరికాలోని వెర్మాంట్‌ ప్రాంతంలో మ్యాపల్‌ చెట్లు రంగులు మారే సమయంలోనిది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు