close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశి ఫలం

గ్రహబలం (జులై 5 - 11)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


అనేక శుభయోగాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో కలసివస్తుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్నిస్తాయి. అభివృద్ధిపథంలో పయనిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. దుర్గాదేవిస్మరణ శుభప్రదం.


ఇష్టకార్యసిద్ధి ఉంది. మనసులో అనుకుంటున్నదే చేయండి. ధర్మం కాపాడుతోంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. ఉద్యోగపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అవమానించేవారున్నారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలుంటాయి. ఇష్టదైవ స్మరణ మేలుచేస్తుంది.


ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మనోభీష్టం సిద్ధిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. అధికారుల గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితముంటుంది. సంకల్పసిద్ధి ఉంది. క్రమక్రమంగా మంచి జరుగుతుంది. వారం మధ్యలో విఘ్నాలు ఎదురవుతాయి. ఖర్చు పెరిగే సూచనలున్నాయి. శివారాధన శ్రేష్ఠం.


సకాలంలో పనులు అవుతాయి. తెలియని విఘ్నాలున్నాయి. బుద్ధి చతురతతో వాటిని అధిగ మిస్తారు. ధనలాభం సూచితం. సుఖంగా కాలం గడుస్తుంది. ఉద్యో గులకు శుభప్రదం. వ్యాపారంలో కొంత అవరోధముంది. అపార్థాలకు తావివ్వకూడదు. దగ్గరివారి సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్యహృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. వ్యాపారం కలసివస్తుంది. అన్నివిధాలా లాభదాయకమైన కాలం నడుస్తోంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి పనులు చేసి ఆదర్శవంతంగా నిలుస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టయోగముంది. ఎటుచూసినా మీదే విజయం అన్నట్లుగా కాలం సహకరిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.


ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ప్రతి నిర్ణయం ఇంట్లోవారితో చెప్పి తీసుకోండి. దేనికీ తొందరపనికిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొందరివల్ల ఆటంకాలు వస్తాయి. ఓర్పుతో బయటపడగలుగుతారు. వారం మధ్యలో శుభం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్మరణ శ్రేయోదాయకం.


మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. అనుకున్న ఫలితం వారం మధ్యలో వస్తుంది. ఆశయం నెర వేరుతుంది. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. అయినా ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలున్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. గృహ, భూ లాభాలున్నాయి. దుర్గాధ్యానంతో మనశ్శాంతి కలుగుతుంది.


ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ఉద్యోగపరంగా కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. అనేక విఘ్నాలున్నాయి. శాంతచిత్తంతో పరిష్కరించే వీలుంది. ధర్మకార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం ఫలిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. శివారాధన మంచిది.


కొంత ఇబ్బంది కలిగించే కాలమిది. ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. ఉద్యోగంలో సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంటుంది. మిత్రుల సలహా అవసరం. అధికారుల ఒత్తిడి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. పొదుపు అవసరం. వారాంతంలో శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. నవగ్రహశ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది.


అదృష్టయోగముంది. ఎటుచూసినా అద్భుతమైన ఫలితమే గోచరిస్తోంది. ప్రతిభతో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. గురుశ్లోకం చదువుకుంటే మనశ్శాంతి ఉంటుంది.


ఆర్థికంగా శుభకాలం. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. వారం మధ్యలో మంచి జరుగుతుంది. కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ఆపదలు తొలగుతాయి. శాంతి లభిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. ఆదిత్యహృదయం చదివితే మేలు జరుగుతుంది.


అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంది. ధనలాభం సూచితం. సుఖసంతోషాలుంటాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దేనికై ప్రయత్నం చేస్తున్నారో అది ఫలిస్తుంది. కుటుంబసభ్యులకు మీవల్ల మేలు జరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఆదిత్యహృదయం చదివితే శాంతి లభిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు