close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూమాతకు బరువు తగ్గిస్తున్నారు!

ప్రతి వ్యక్తీ జీవితకాలంలో తన బరువుకి ఆరువందల రెట్లు బరువైన చెత్త పడేస్తాడట. అలా ఈ భూమ్మీద ఉన్న ఎనిమిది వందల కోట్లమందీ సృష్టించే చెత్తకి ఎంత స్థలం కావాలీ..! మనం నివసించే ఈ భూమి చెత్తకుప్పలా మారకూడదంటే- వాడిన వస్తువుల్నే తిరిగి వాడుకోక తప్పదు... అంటున్నారు ఈ రీసైక్లింగ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌. 

ఈ కాగితానికి చెట్లతో పనిలేదు

కాగితం తయారీకి కలప ఎందుకు, పనికిరావని పారేసే వస్తువులు ఎన్నో ఉండగా... అంటుంది కావ్య మాదప్ప. గుడ్డపీలికలు, అవిసె బెరడు, మల్బరీ, వరి దుబ్బు, కాఫీ కాయలతొక్కు, అరటిబోదెలు, కొబ్బరి పొట్టు... ఇలా ఎన్నోరకాల వ్యర్థాలనుంచి కాగితాన్ని తయారుచేస్తోంది కావ్య తన ‘బ్లూక్యాట్‌ పేపర్‌’ సంస్థ ద్వారా. ‘మామూలు కాగితం తయారుచేయడానికి చెట్లను కొట్టేస్తారు, బోలెడన్ని నీళ్లు వాడతారు. అందుకే వాటికి ప్రత్యామ్నాయం ఆలోచించా’నంటుంది కావ్య. 68 శాతానికి పైగా సెల్యులోజ్‌ ఉండే పదార్థం ఏదైనా కాగితం తయారీకి పనికొస్తుందని తెలుసుకున్న ఆమె వేర్వేరు పరిశ్రమల్లో వాడిపారేసే వ్యర్థాలపైనే దృష్టిపెట్టింది. వస్త్ర పరిశ్రమ నుంచి మిగిలిపోయిన పీలికలనీ, మల్బరీ ఆకులు కోసేశాక మిగిలిన కాడల్నీ, అరటి చెట్లు కొట్టేశాక మిగిలే బోదెల్నీ... ఇలా రకరకాల వ్యర్థాలతో కాగితాన్ని తయారుచేస్తోంది. ప్రతి నెలా దాదాపు 20 టన్నుల వ్యర్థాలను సేకరించి కాగితాలను రూపొందిస్తోంది ‘బ్లూక్యాట్‌ పేపర్‌’. మార్కెట్లో ఉన్న పేపరు తయారీ యంత్రాలన్నీ కలపతో పనిచేసేవే కావడంతో ప్రత్యేకంగా యంత్రాలను తయారుచేయించుకుంది కావ్య. ఈ వ్యర్థాల రీసైక్లింగ్‌ వల్ల భూమాతకు చెత్త బరువు తగ్గించడమే కాదు, నెలకు 30 టన్నుల కలపనీ, రోజుకి 55వేల లీటర్ల నీటినీ ఆదా చేస్తున్నానంటుంది కావ్య ఒకింత గర్వంగా. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు