close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆలూ చీలా... నోరూరేలా!

దోశల్లో ఎన్నిరకాలు వచ్చినా... వాటిని ఇంకేదైనా కొత్తరుచిలో చేసుకుంటే బాగుండని అప్పుడప్పుడూ అనిపించడం మామూలే. దీనికి పరిష్కారమే చీలా వెరైటీలు. ఏ పూటైనా అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా వీటిని తినేయొచ్చు.

ఓట్స్‌తో...

కావలసినవి:
ఓట్స్‌: అరకప్పు, సెనగపిండి: అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, టొమాటో ముక్కలు: పావుకప్పు, జీలకర్ర: పావుచెంచా, అల్లం తరుగు: అరచెంచా, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తరుగు: పావుకప్పు, కారం: పావుచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.
తయారీవిధానం:
ఓట్స్‌ని మిక్సీలో తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పొడిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ ఊతప్పం పిండిలా చేసుకోవాలి. స్టౌమీద పెనం పెట్టి చెంచా నూనె వేయాలి. తరవాత ఈ పిండిని గరిటెతో మందంగా వేసి మూత పెట్టాలి. ఇది రెండువైపులా కాలాక ఓ ప్లేటులోకి తీసుకోవాలి. వేడివేడిగా ఏదయినా చట్నీ లేదా సాస్‌తో కలిపి తినొచ్చు.


పనీర్‌ బేసన్‌ చీలా

కావలసినవి:
సెనగపిండి: కప్పు, పెరుగు: పావుకప్పు, కారం: అరకప్పు, అల్లం ముద్ద: అరటేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, వాము: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.స్టఫింగ్‌కోసం: పనీర్‌తురుము: కప్పు, క్యాప్సికం ముక్కలు: పావుకప్పు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, పచ్చిమిర్చి ముక్కలు: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు.
తయారీవిధానం:
ముందుగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి. స్టౌమీద పాన్‌ పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం తరుగు, క్యారెట్‌తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేయాలి. ఇది వేగాక స్టౌ కట్టేసి పనీర్‌ తురుము వేసి ఓసారి కలపాలి. అదేవిధంగా నూనె తప్ప సెనగపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పల్చగా లేదా గట్టిగా కాకుండా కలిపి నానబెట్టుకోవాలి. .పావుగంటయ్యాక స్టౌమీద పాన్‌ పెట్టి సెనగపిండి మిశ్రమాన్ని దోశలా వేసి నూనె వేయాలి. ఇది రెండువైపులా కాలాక పెద్ద చెంచా పనీర్‌ మిశ్రమాన్ని దీనిపైన ఓ వైపు ఉంచి నిమిషమయ్యాక దోశను మధ్యకు మడిచి ప్లేటులోకి తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ వేసుకోవాలి.


ఆలూతో..

కావలసినవి:
బంగాళాదుంపలు: మూడు, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉల్లికాడల తరుగు: రెండుటేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.
తయారీవిధానం:
బంగాళాదుంపల చెక్కు తీసి తురిమి ఓ గిన్నెలో వేసి కాసిని నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక ఆ తురుమును గట్టిగా పిండేసి మరో గిన్నెలో వేసుకోవాలి. దీనిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలపాలి. స్టౌమీద పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని గరిటెతో వేసి మందంగా అట్టులా పరిచి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్ని
వేసుకోవాలి.


పెసలతో...

కావలసినవి:
పెసలు: కప్పు, సెనగపప్పు: అరకప్పు, మినప్పప్పు: అరకప్పు, సజ్జలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం తరుగు: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, పెరుగు: పావుకప్పు.
తయారీ విధానం:
సజ్జలు, పెసలు, సెనగపప్పు మినప్పప్పును పిండిలా పట్టించి పెట్టుకోవాలి. చీలా చేసుకోవాలనుకున్నప్పుడు ఓ గిన్నెలో కప్పు పిండిని తీసుకుని పెరుగు వేసి ఓసారి కలపాలి. తరువాత కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా చేసుకోవాలి. ఇది మరీ పల్చగా లేదా మందంగా ఉండకూడదు. స్టౌమీద పెనం పెట్టి చెంచా నూనె వేసి... ఈ పిండిని మందంగా పరిచి,  మళ్లీ నూనె వేస్తూ
రెండువైపులా కాల్చి తీసుకోవాలి. దీనికి పల్లీచట్నీ మంచి కాంబినేషన్‌.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.