close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచాల్లేని ఊళ్లు

ఇళ్లకు తలుపులుండని శని శింగణాపూర్‌ గురించి అందరికీ తెలుసు! కానీ, ఇళ్లలో మంచాలంటూ కనిపించని ‘కోట్గావ్‌’ గురించి విన్నారా ఎప్పుడైనా! ఒడిశాలోని నోపాడ జిల్లాలోని గ్రామమిది. తొమ్మిది వందల జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏ ఇంట్లోనూ ఒక్క మంచం కూడా కనిపించదు. తరతరాలుగా అక్కడివాళ్లు మంచాలే కాదు, కుర్చీలూ వాడట్లేదు. ఎందుకంటే.. వాళ్ల ఇష్టదైవం ‘ద్వారశని’ కోసమని చెబుతారు. ఆ దేవత, ఆమె కొడుకు ఖతతలి బాబు, భర్త గురుబుడా ముగ్గురూ ఆ గ్రామానికి మొదట్లో ఉంటారట. ఆ ఊళ్లో ఎవరైనా మంచాలు, కుర్చీల మీద పడుకోవడమో, కూర్చోవ డమో చేస్తే ఆ దేవతను అగౌరవపరిచిన ట్టేనట! అందుకని వాళ్లంతా నేల మీదే పడుకుంటారు, కిందే కూర్చుంటారు. ఇదే రాష్ట్రంలోని దియోగఢ్‌ జిల్లా తిపిరిసింఘ పల్లెవాసులూ ఇంతే! ‘బరిహని’ అనే తమ దేవతకు అమర్యాదకరమని వీళ్లూ మంచాలేసుకోరు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు