close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్రహబలం (ఆగస్టు 2 - 8)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

శుభాలు జరుగుతాయి. వ్యాపార లాభాలుంటాయి. ఉద్యోగంలో శ్రద్ధగా వ్యవహరించాలి. అవరోధాలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా ధ్యానంతో శాంతి లభిస్తుంది. 


మంచి ప్రవర్తనతో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు అనుకూలం. ధైర్యంతో ముందడుగు వేస్తారు. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచించి అడుగేయాలి. సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. అశాంతికి గురిచేసేవారున్నారు. శుభవార్త ఉంది. ఇష్టదైవారాధనతో శక్తి లభిస్తుంది.


అదృష్టయోగముంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఎదురుచూస్తున్న పనిలో లాభముంటుంది. నిరంతరసాధనతో విఘ్నాలను దాటతారు. సంపదలు పెరుగుతాయి. ఉత్తమ భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పెద్దల అనుగ్రహంతో జీవితాశయం నెరవేర్చుకుంటారు. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. సూర్యారాధన ఉత్తమం.


ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. సందేహించకుండా పనులు మొదలుపెట్టాలి. అవరోధాలు ఎదురవుతాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరగలరు. నిరుత్సాహం వెంటాడినా మొత్తమ్మీద కార్యసిద్ధి ఉంటుంది. అధిక వ్యయం సూచితం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. న్యాయపరంగా లాభపడతారు. ఇష్టదేవతాస్తోత్రం శుభాన్ని కలిగిస్తుంది.


అంకితభావంతో పనిచేసి విజయం సాధిస్తారు. శుభయోగాలున్నాయి. ప్రణాళికలతో సిద్ధం కండి. సొంత నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధికి తగిన వాతావరణం ఉంది. అవసరాలకు ధనం లభిస్తుంది.  స్థానచలనం సూచితం. వారాంతంలో మేలు జరుగుతుంది.
విష్ణుసహస్రనామ పారాయణం మంచిది.


ముఖ్యకార్యాల్లో శుభం జరుగుతుంది. వ్యాపారలాభం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంది. శత్రుదోషం వెంటాడుతోంది. మిత్రుల సూచనతో శాంతి లభిస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ధనలాభం సూచితం. వారాంతంలో మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.


అద్భుతమైన కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలసివస్తుంది. ఎటు చూసినా శుభమే కన్పిస్తోంది. క్రమంగా ఇబ్బందులు తొలగుతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. బ్రహ్మాండమైన మేలు ఒకటి జరుగుతుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతా స్మరణ ఉత్తమం.


ఆర్థికంగా కలసివస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మంచి కార్యసిద్ధి ఉంది. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారరీత్యా కొంత శ్రమ పెరిగినా అంతిమంగా శుభం జరుగుతుంది. అవగాహనతో అన్ని సమస్యలు తొలగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


పరీక్షా కాలం ఇది. ఆత్మశక్తితో ముందుకు నడవాలి. అడుగడుగునా విఘ్నాలుంటాయి. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగల శక్తి ఉంది. మిత్రుల సహకారం తీసుకోండి. కుటుంబసభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎదురుచూస్తున్న పని అవుతుంది. నవగ్రహస్తోత్రంతో మనశ్శాంతి లభిస్తుంది.


ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రతి పనీ ధైర్యంగా చేయాలి. అడ్డుపడేవారుంటారు. దగ్గరివారితో జాగ్రత్త. ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. పట్టుదలతో ఖ్యాతిని సంపాదిస్తారు. భూ, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఇష్టదైవస్మరణ మంచిది.


అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఎటుచూసినా కార్యసిద్ధి ఉంది. విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. త్వరగా అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారం కలసివస్తుంది. ఆర్థికంగా ఉత్తమకాలం నడుస్తోంది. మిత్రుల ద్వారా మేలు పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదైవస్మరణ శక్తినిస్తుంది.


ఉత్తమ కార్యసిద్ధి ఉంటుంది. అన్నివిధాలా శుభమే గోచరిస్తోంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగ ఫలాలు శుభ్రపదం. వ్యాపారంలో మిశ్రమఫలితం ఉంటుంది. ధనలాభం సూచితం. సరైన ప్రణాళిక ద్వారా లాభపడతారు. స్థిరాస్తులు కూడబెడతారు. ఈర్ష్ష్యాపరులతో జాగ్రత్త. అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయస్వామి స్మరణతో ప్రశాంతజీవితం ఏర్పడుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు