close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందాల భవనంలో... ఆహ్లాద విడిది!

చుట్టూ సముద్రం... దాన్ని ఆనుకుని పచ్చని కొండ... దానిపైన అద్భుతంగా తీర్చిదిద్దిన భవంతి... చూడటానికి ఎంత బావుందో కదా! పసుపు, తెలుపు రంగుల కలయికలో ఆహ్లాదానికి చిరునామాలా ఉన్న ఈ బీచ్‌ రిసార్ట్‌ మెక్సికోలో, పసిఫిక్‌ సముద్ర తీరంలో ఉంది. కేవలం ఆరు గదులు మాత్రమే ఉండే దీనిలో ఒక రోజు గడపడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా... దాదాపు రూ.5 లక్షలు! దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ భవనంలో ఎట్నుంచి చూసినా బయట సముద్రం కనిపించేలా పెద్ద పెద్ద కిటికీలు అమర్చారు. అలాగే కింద ఉన్న ఈతకొలను ప్రతి గదికీ అనుసంధానమై ఉంటుంది. అంటే గది తలుపు తీస్తే, నేరుగా స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేయొచ్చన్నమాట! పూల్‌లో ఈత కొడుతూ సముద్రం మీదనుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తుంటే... ఆ కిక్కే వేరట! అందుకే విలాసవంతంగా తీర్చిదిద్దిన ఈ రిసార్ట్‌కి ఎంత ఖర్చయినా సరే, పర్యటకులు వచ్చి వాలిపోతుంటారు మరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు