
ముసలితెలివి
‘మీ భర్తేననుకుంటా, తప్పిపోయారు’ ఎనభై ఏళ్ళ ముసలాయన్ని తీసుకొచ్చి అప్పజెప్పాడు యువ పోలీసాఫీసరు.
‘ఏవయ్యా... రోజూ వాకింగ్‌కి వెళ్తావు కదా... ఎట్టా తప్పిపోయావ్?’ కంగారుగా అడిగింది ముసలమ్మ.
‘ఊరుకోవే పిచ్చిమొహమా... నేనెక్కడ తప్పిపోయానూ? ఏదో కాస్త కాళ్ళు నొప్పులెడుతుంటేనూ... ఇక్కడిదాకా నడవలేక...’ గుసగుసగా చెప్పాడు ముసలాయన.
మేలుకునే... తిట్టా
భర్త: రాత్రి నిద్రలో నన్ను చాలా అసహ్యంగా తిట్టావు.
భార్య: లేదు, మీరు పొరబడుతున్నారు.
భర్త: పొరపాటేంటి, నా చెవులారా వింటే.
భార్య: అహఁ, మీరు వినడం పొరపాటు కాదు. అప్పుడు నేను నిద్రపోతున్నాననడం పొరపాటు.
ఎవరా ఆంటీ?
భార్య: హలో... ఏమండీ...
భర్త: ఏంటీ, ఫోనెందుకు చేశావు... ఆఫీసులో నేను చాలా బిజీగా ఉంటాను, ఎప్పుడూ ఫోన్ చెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను? సర్లే, ఇంతకీ ఎందుకు చేశావు..?
భార్య: నేనూ పిల్లలూ మాల్కి వచ్చాం. మాకు కాస్త ముందు మీ చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఆంటీ ఎవరో కనుక్కోమని పిల్లలు గోల చేస్తుంటే... ఫోన్ చేశా.
భ్రమ అంటారు
రమణ: బాపూబొమ్మలా అందంగా ఉండి, తెలివైనదీ చురుకైనదీ అయి ఉండి భర్తతో ఎప్పుడూ పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామీ?
స్వామీజీ: భ్రమ అంటారు నాయనా.
అవసరం
భార్య: పక్కింటి సుజాత ఇందాక పంచదార కోసం వచ్చినప్పుడు నన్నూ నా అందాన్నీ అంతలా మెచ్చుకుంది కదా అది వింటుంటే మీకేమనిపించిందీ?
భర్త: ‘అవసరం కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారుకదా’ అనిపించింది.
పెళ్ళామా... మజాకా..!
ఉదయాన్నే భర్త నిద్ర లేచి భార్యను లేపాడు.
భర్త: ఏఁవోయ్, ఇద్దరం కలిసి సరదాగా జాగింగ్‌కి వెళదామా?
భార్య: అంటే నేను లావెక్కానని మీ ఉద్దేశ్యమా?
భర్త: అదేం కాదోయ్, జాగింగ్ చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది.
భార్య: నేను రోగిష్టిదాన్నంటున్నారా?
భర్త: అదికాదు, సర్లే నీకు లేవటం ఇష్టం లేకపోతే వదిలెయ్.
భార్య: ఓహో, నేను బద్ధకస్తురాలిననా మీ ఉద్దేశ్యం?
భర్త: నువ్వు నా మాటల్ని అపార్ధం చేసుకుంటున్నావు. నేను చెపుతున్నది ఏమిటంటే...
భార్య: ఏం బెబుతున్నారు? మీ మాటలు నాకు అర్థం కావు అనుకుంటున్నారా? నాకు తెలివి లేదా?
భర్త: అయ్యో, నేను అలా ఎప్పుడు అన్నాను?
భార్య: మరైతే నేను అబద్ధాలు అడుతున్నానా?
భర్త: తల్లీ, నీకు దండం పెడతాను. పొద్దుపొద్దున్నే అనవసరంగా గొడవ పెట్టుకోకు.
భార్య: ఓహో, నేను జగడాలమారిని... ఇదేనా మీరు అనేది?
భర్త: నన్ను క్షమించేసి నువ్వు పడుకోవే. నేను ఒక్కడినే జాగింగ్‌కి వెళ్తాను.
భార్య: బాగా ఎంజాయ్ చేయటం కోసం ఒంటరిగా వెళ్లటం మీకు అలవాటే కదా.
భర్త: నాకు కళ్లు తిరుగుతున్నాయి. నేనసలు జాగింగ్‌కే వెళ్లను.
భార్య: మీకు చాలా స్వార్థం. ఎంతసేపూ మీ గురించే తప్ప నా ఆరోగ్యం గురించిన ఆలోచనే లేదు. డాక్టరు నన్ను రోజూ కాసేపు నడవమన్నాడు కదా.
...భర్త తల పట్టుకుని అసలు తప్పు ఎక్కడుందా అని ఆలోచిస్తున్నాడు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్