
కొన్ని తెగలూ, సంచార జాతుల వారు తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. అలా వెళ్లినప్పుడు అడవుల్ని నరికో కొండల్ని తొలిచో.. ఖాళీ స్థలాల్లోనో ఇళ్లు కట్టుకుంటుంటారు. అయితే మలేషియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్లో ఎక్కువగా కనిపించే బజౌ అనే సంచార తెగవారు మాత్రం ఎక్కడికెళ్లినా నీటిపైనే ఇళ్లు నిర్మించుకుని నివాసముంటారు. చేపలు పట్టడమే వీరి జీవనాధారం. నీటిలోనే బతికే ఈ తెగవారిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే వీరు పది నుంచి పదమూడు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టగలరట. నిమిషం పాటు శ్వాస తీసుకోకుండా ఉండటమే మనకు కష్టమవుతుంది. అలాంటిది అన్ని నిమిషాలంటే నమ్మశక్యంగా లేదు కదూ. అందుకే కేంబ్రిడ్డి యానివర్సిటీ నిపుణులు వారి జన్యు నమూనాలను సేకరించి పరిశోధనలు చేసి కొన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్లని సూపర్ హ్యూమన్లుగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత మ్యాగజీన్‘జర్నల్ సెల్’ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.
ఇంతకీ విషయం ఏంటంటే... బజౌ తెగవారి శరీరంలో సాధారణ మానవులలో కంటే ప్లీహం పెద్ద పరిమాణంలో(దాదాపు 50 శాతం పెద్దదిగా) ఉంటుందట. అందుకే వాళ్లు ఎక్కువ సమయం ఊపిరిబిగపట్టగలుగుతారట. ఎలాగంటే... నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాస క్రియలో ప్లీహం కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రరక్తకణాలను రక్త ప్రసరణలోకి చేర్చుతుంది. తద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. అందుకే శ్వాస నియంత్రణలో అంత సామర్థ్యం వారి సొంతం అని చెబుతున్నారు కేంబ్రిడ్జి నిపుణులు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్