close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాశి ఫలం

గ్రహబలం (సెప్టెంబరు 06 - సెప్టెంబరు 12)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

అదృష్టవంతులు అవుతారు. తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది. కాలం సహకరిస్తోంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. వ్యాపార లాభముంది. మిత్రబలం రక్షిస్తుంది. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఒక ఉపద్రవం నుండి బయటపడతారు. వారం మధ్యలో మంచి ఫలితం వస్తుంది. ఆంజనేయస్వామి స్మరణతో ప్రశాంతత చేకూరుతుంది.


ఆర్థికాంశాలు బాగుంటాయి. కొన్ని తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడికి లోనవకూడదు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా కోలుకోవడం కష్టం. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. క్రమంగా మంచి జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. అన్ని విధాలా శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రశాంత జీవితం గడుపుతారు. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


క్రమంగా పనులు పూర్తి అవుతాయి. దృఢసంకల్పంతో ముందుకు సాగాలి. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగపరంగా సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో మిశ్రమ ఫలితముంది. వారాంతంలో శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.


కాలం సహకరిస్తుంది. భవిష్యత్తుపట్ల స్పష్టత వస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగపరంగా కలసివస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. కొందరికి ఉపకారం చేస్తారు. అపార్థాలకు అవకాశముంది. అధికారులతో శ్రద్ధగా సంభాషించాలి. ఆర్థికస్థితి క్రమంగా మెరుగవుతుంది. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది.


ఆర్థికంగా కలసివస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలుంటాయి. ఎవరినీ అనుమానించవద్దు. విఘ్నాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఇంట్లోవారి సూచనలు పాటించండి. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. గత వైభవం దక్కుతుంది. ప్రశాంతత కోసం విష్ణు సహస్రనామం చదవాలి.


చక్కని విజయం లభిస్తుంది. గొప్పవారు అవుతారు. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. అధికార లాభం సూచితం. వ్యాపారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. కొందరివల్ల మేలు జరుగుతుంది. అభీష్టసిద్ధి ఉంది. గౌరవం పెరుగుతుంది. స్వయంకృషితో పైకి వస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదైవస్మరణ మంచిది.


శ్రేష్ఠమైన కాలం. అన్నివిధాలా కలసివస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ధర్మ చింతనతో అభివృద్ధిని సాధిస్తారు. గృహలాభం ఉంటుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఎటుచూసినా అదృష్టయోగమే కనపడుతోంది. అర్హతలను పెంచుకోవటానికి సరైన సమయం. శివారాధన శ్రేష్ఠమైన ఫలితాన్నిస్తుంది.


కాలం అనుకూలించడం లేదు. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచండి. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తికావచ్చు. కుటుంబసభ్యుల అండ అవసరం. విభేదాలు వద్దు. వ్యాపారంలో చిక్కులుంటాయి. వారాంతంలో శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. 


కష్టకాలం నడుస్తోంది. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. నిరుత్సాహపడకుండా లక్ష్యంపై దృష్టి పెడితే అంతా శుభమే జరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కష్టపడాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో మంచి జరుగుతుంది. శ్రీరామధ్యానం శుభాన్నిస్తుంది.


కార్యసిద్ధి ఉంటుంది. శుభ యోగముంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ధన, ధాన్యాభివృద్ధి సూచితం. చేపట్టిన పనుల్లో మంచి ఫలితం వస్తుంది. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో ఆటంకాలుంటాయి. వారం మధ్యలో ఒక విజయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రవిధ్యానం మంచిది.


మంచి భవిష్యత్తు ఉంది. అద్భుతమైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. కాలానుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. మేలైన కాలం నడుస్తోంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఇష్టదేవతారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.