close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బొమ్మల ఫోన్‌కేస్‌ చూశారా!

ఫోను కేసు మీద రంగురంగుల టెడ్డీబేర్లూ, పిల్లిబొమ్మలూ ఉండటం మనకు తెలుసు. కానీ ఆ బొమ్మలే పర్సుగా మారిపోతే! బయటకు వెళ్లేటప్పుడు మనకు అవసరమైన చిన్న చిన్న వస్తువులన్నీ అందులో వేసేసే అవకాశం ఉంటే? భలే ఉంటుంది కదా. ఆ ఆలోచనకు రూపమే ఈ ‘కార్టూన్‌ పర్స్‌ బ్యాక్‌ కవర్స్‌’. ఇవి అందమైన కార్టూన్ల రూపంలో ముద్దొచ్చేలా ఉంటాయి. ఆ బొమ్మల పైభాగంలో ఒక జిప్‌ ఉంటుంది. అందులో డబ్బులు, తాళాలు, ఏటీఎం కార్డుల వంటి వస్తువులను పెట్టుకోవచ్చు. అప్పుడిక ఫోనూ, పర్సూ విడిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కేసులను సిలికాన్‌తో చేయడం వల్ల పొరపాటున ఫోన్‌ కిందపడినా ఏమీకాదు. చూడటానికి అందంగానూ ఉంటాయి.


కెటిల్‌ను మడత పెట్టేయొచ్చు!

ప్రయాణాలప్పుడు కాఫీ, టీ, ఏం కావాలన్నా కెటిల్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అలా అని అసలే బోలెడు లగేజీతో వెళ్తున్నప్పుడు మళ్లీ బరువైన స్టీల్‌ కెటిల్‌ను మోసుకెళ్లడం కొంచెం కష్టంగా ఉంటుంది. స్థలం కూడా ఎక్కువ ఆక్రమిస్తుంది. అందుకే ఈ ఫోల్డబుల్‌ కెటిల్‌ తెచ్చేసుకుంటే ఇక ఆ ఇబ్బందే ఉండదు. ఎందుకంటే దీన్ని ఎంచక్కా మడత పెట్టేయొచ్చు. అరలీటరు వరకూ నీళ్లు పట్టే ఈ కెటిల్‌ను సిలికాన్‌తో తయారుచేశారు. అందువల్ల బరువు కూడా పెద్దగా ఉండదు. మూడు అంచెలుగా ఉండే దీన్ని అవసరమైనప్పుడు హ్యాండిల్‌ పైకి లాగి వాడుకోవచ్చు. పనైపోయాక కిందకి నొక్కితే ముడుచుకుపోతుంది. ప్రయాణాలప్పుడు మాత్రమే కాదు... ఇంట్లోనూ పెట్టుకుంటే హఠాత్తుగా గ్యాస్‌ అయిపోయినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఏ అలమరలో అయినా చక్కగా ఇమిడిపోతుంది.


వాడిన నూనె వడకట్టేసేలా...

పొద్దున్నే ఏ వడలో వేసినా... సాయంత్రం వేడివేడిగా బజ్జీలు చేసినా... అవి వేయించగా మిగిలిపోయిన నూనెలో అడుగున మడ్డి పేరుకుంటుంది. దాన్ని మళ్లీ విడిగా వడకట్టుకోవడం పెద్ద పని. అలా కాకుండా ఈ స్టీల్‌ జార్‌ సాయంతో నూనెను నేరుగా వడకట్టేయొచ్చు. దీని పైభాగాన రంధ్రాలతో నిండిన ఓ జాలీ ఉంటుంది. వాడిన నూనెను ఆ జాలీ మీదుగా జార్‌లో పోస్తే... వ్యర్థాలన్నీ పైనే ఉండిపోయి నూనె మాత్రమే కిందకి చేరుతుంది. అప్పుడు ఆ వ్యర్థాలను బయటపడేసి జాలీని కడిగేసుకుంటే సరి! నూనెను చక్కగా మళ్లీ వాడుకోవచ్చు.


పప్పీ బెడ్డూ మన మంచంలోనే!

నిద్రపోయే ముందు మనకెంతో ఇష్టమైన పప్పీతో ఆడుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది. కొంతమంది దాన్ని మంచం మీదే ఉంచుకుని పడుకుంటారు కూడా. కానీ అన్నివేళలా అదంత సౌకర్యంగా ఉండదు. అందుకే పెట్‌కి కూడా మన మంచంలోనే ప్రత్యేకంగా చోటు ఉండేలా ‘బెడ్స్‌ విత్‌ బిల్ట్‌ ఇన్‌ పెట్‌ బెడ్‌’ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మన మంచం కింద కుక్కపిల్ల పట్టేంత ఖాళీ ఉండి... అందులో మెత్తటి పరుపూ, అవసరమైనప్పుడు ఆ ఖాళీని మూసేసేలా రెండు కర్టెన్లూ ఉంటాయి. అప్పుడు పప్పీ మనతో ఆడుకున్నంతసేపూ ఆడుకుని, నిద్రపోయే ముందు టింగుమని కిందకి దూకి దాని బెడ్‌ మీదకి  వెళ్లిపోతుందన్నమాట. రెండు మూడు పెట్స్‌ ఉంటే వాటన్నింటికీ ఇందులోనే బెడ్స్‌ ఉండేలా కూడా ఈ మంచాలను తయారుచేస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.