close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అద్దాల గదిలో టాయిలెట్లు..!

ఫీసు గదులూ షాపింగ్‌మాల్స్‌లాంటి వాటిని అద్దాలతో కడతారు. అయితే, టాయిలెట్లు అలా ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ జపాన్‌ రాజధాని టోక్యోలో ఉన్న ‘హారు నొ ఒగవా’ కమ్యూనిటీ పార్కులో ఈమధ్య కట్టిన పారదర్శక టాయిలెట్లు అందరికీ తెగ నచ్చేశాయి. అసలు విషయం ఏంటంటే... పబ్లిక్‌ టాయిలెట్లు శుభ్రంగా ఉండవని వాటిని వాడటానికి చాలామంది ఇబ్బంది పడుతుండడం సహజం. ‘ప్రజల్లో ఈ భావనను మార్చి తమ దగ్గరున్న పబ్లిక్‌ టాయిలెట్లు శుభ్రంగా ఉంటాయి’ అని తెలియచేయాలనుకుంది స్థానిక స్వచ్ఛంద సంస్థ నిపాన్‌ ఫౌండేషన్‌. అందులోభాగంగానే ‘ద టోక్యో టాయిలెట్‌ ప్రాజెక్టు’ని ప్రారంభించి పేరుపొందిన పదహారు మంది ఆర్కిటెక్టులకు స్థానిక పార్కుల్లో ఉన్న టాయిలెట్లను కొత్తగా మార్చే బాధ్యతను అప్పగించింది. వీరిలో ఆర్కిటెక్ట్‌ ‘షిగెరు బాన్‌’ నిర్మించిందే ఈ అద్దాల టాయిలెట్‌. బయట నుంచి చూస్తే దీని లోపల ఎలా ఉందీ మొత్తం కనిపిస్తుంది. దాంతో శుభ్రంగా ఉందో లేదో తెలిసిపోతుంది. అయితే, ఒక్కసారి లోపలికెళ్లి తలుపు లాక్‌ చెయ్యగానే అద్దాలు పారదర్శకతను కోల్పోయి బయటివారికి ఏమీ కనిపించదు. కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆలోచన బాగుంది కదూ..!


సన్నని ఇల్లు...  ఖరీదు రూ.2 కోట్లు!

ఫొటోని చూస్తే ఎవరైనా గోడను ఇల్లు డిజైన్‌లో కాస్త మందంగా ఎత్తుగా కట్టారు అనుకోవాల్సిందే. కానీ ఇది నిజంగా ఇల్లే. ‘పీ హౌస్‌’గా పిలిచే ఈ ఇల్లు చికాగోలో ఉంది. అలాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎంత స్థలం ఉన్నా విలువైనదే కదా! అందుకేనేమో ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ కేవలం 3 అడుగుల వెడల్పుతో కొన్నేళ్ల కిందట ఈ సన్నని ఇంటిని నిర్మించారు. అంతే, అప్పట్నుంచీ ఇది టూరిస్ట్‌ స్పాట్‌ అయిపోయింది.  జనం ఎక్కడెక్కడినుంచో దీని ఫొటోలు తీసుకోవడానికి వస్తుంటారు. దాంతో ఈమధ్య సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అయింది. అలా అని ఈ పీ హౌస్‌ కేవలం చూడ్డానికే పనికొస్తుందనుకుంటే పొరబడినట్లే. 1,122 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న దీన్లో రెండు పడకగదులూ, రెండు బాత్‌రూమ్‌లూ, హాలూ, వంటగదీ అన్నీ ఉన్నాయట. ఇంత వెరైటీగా ఉంటే ధర కూడా బాగానే పలుకుతుందిగా... అందుకే, యజమాని ఈ  ఇంటిని రూ.రెండుకోట్లకు అమ్మకానికి పెట్టేయడంతో ఇప్పుడు వార్తల్లోకెక్కేసింది.


కట్టెలు ఏరడం ఈ కుక్క హాబీ!

బుద్ధిగా కనిపిస్తున్న ఈ అందమైన కుక్కకు ఓ హాబీ ఉంది తెలుసా? అదేంటో వింటే మీరూ ముచ్చటపడతారు. దీని పేరు బ్రూస్‌. తన యజమానితో కలిసి అమెరికాలో ఉంటుంది. వాకింగ్‌కు వెళ్లినప్పుడల్లా చెట్ల కింద కనిపించే పెద్దపెద్ద కట్టెలను ఏరుకోవడం దీనికి అలవాటుగా మారిందట. అలా అని వాటితో ఆడుకోదు... బాహుబలిలో దేవసేనలా పోగుచేస్తుందంతే. వాటిని నోటకరుచుకుని వచ్చి ఓ చోట భద్రంగా దాచేస్తోందట. దాని సరదా చూసి ముచ్చటపడిన యజమాని... ఈ కట్టెల కలెక్షన్‌తో బ్రూస్‌ని ఫొటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అది చూసిన వాళ్లకి బ్రూస్‌ తెగ ముద్దొచ్చేయడంతో ఆ పోస్ట్‌కు బోలెడు లైక్‌లూ కామెంట్లూ వచ్చేస్తున్నాయి.


వెలిగే మ్యాన్‌హోల్స్‌!

ట్టణాలూ నగరాల్లో రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లు కనిపిస్తూనే ఉంటాయి. కొన్నిచోట్ల వాటి మీద మూతలు విరిగిపోయి ప్రమాదకరంగానూ ఉంటాయి. కానీ జపాన్‌లోని టొకొరొజవా పట్టణంలో మాత్రం మ్యాన్‌హోల్‌ మూతలు అందమైన యానిమేషన్‌ చిత్రాలతో దర్శనమిస్తున్నాయి.అంతేనా... సోలార్‌ విద్యుత్‌ సాయంతో రాత్రవ్వగానే అవి ఎల్‌ఈడీ వెలుగుల్ని విరజిమ్ముతూ వచ్చేపోయేవారికి ఆహ్లాదాన్నీ కలిగిస్తున్నాయి. వీధుల్ని చూడచక్కగా మార్చడంతో పాటు, రాత్రిపూట దొంగతనాల్ని అరికట్టేందుకు స్థానిక మునిసిపాలిటీ అధికారులు చేసిన అందమైన ఆలోచన ఇది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.