close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశి ఫలం

గ్రహబలం (సెప్టెంబరు 20-26)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల అండ లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో మేలు కలుగుతుంది. అందరికీ ఉపయోగపడే పనులు చేస్తారు. ఇంట్లో శుభం జరుగుతుంది. మంచివార్త వింటారు. ప్రయాణాలు కలసి వస్తాయి. ధనలాభం ఉంది. లక్ష్మీధ్యానం మంచిది.


ఆర్థికాంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఏ పనిలోనూ తృప్తి లభించదు. ఆత్మీయుల సలహాతో పరిస్థితులు చక్కబడతాయి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. విష్ణుసహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


అభీష్టసిద్ధి ఉంటుంది. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనుకున్న దానికంటే మంచి ఫలితం లభిస్తుంది. వ్యాపారపరంగా వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలున్నా పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. స్వయంకృషితో కీర్తి లభిస్తుంది. వారాంతంలో ఒక మంచి పని చేస్తారు. ఇష్టదైవస్మరణ శక్తినిస్తుంది.


ధనలాభం సూచితం. ఉద్యోగంలో గొప్ప ఫలితం గోచరిస్తోంది. మిత్రుల సహకారంతో విఘ్నాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఒక విషయం మనసును కలచివేస్తుంది. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తోటివారి సలహాలు మనోబలాన్నిస్తాయి. సొంత ప్రణాళికలతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. గణపతి ఆరాధన శ్రేష్ఠం.


అదృష్టయోగముంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. అవాంతరాలనుండి బయటపడతారు. మనసు చెప్పినట్టుగా నడచుకోవాలి. వ్యాపారవిజయం ఉంది. మిత్ర సహకారం అవసరం. శత్రుపీడ తొలగుతుంది. న్యాయపరంగా గెలుపు లభిస్తుంది. కుటుంబమే మీ బలం.
ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. తెలియని కష్టం ఒకటి ఎదురవుతుంది. దగ్గరివారితో విభేదించవద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితముంది. సొంత నిర్ణయం పనికిరాదు. ఇంట్లో వారి సూచనలతో ముందుకెళ్లాలి. మోసపోయే అవకాశముంది. వారాంతంలో మేలు జరుగుతుంది.

శివనామస్మరణ మంచిది.


ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త వహించాలి. శ్రమ పెరుగుతుంది. స్వవిషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. అపార్థాలకు అవకాశముంది. పనులు పూర్తయ్యేవరకు ఓపిక పట్టాలి. మిత్రబలంతో విఘ్నాలను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితముంటుంది. ఖర్చులున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. సూర్య నారాయణమూర్తి ధ్యానం మేలు చేస్తుంది.


అదృష్టవంతులు అవుతారు. ప్రతి పనీ శ్రద్ధతో చేసి లాభపడతారు. ఉద్యోగంలో మేలైన ఫలితముంటుంది. వ్యాపార లాభాలుంటాయి. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతృప్తినిచ్చే సంఘటనలున్నాయి. స్థిమితంగా ఉండాలి. కుటుంబ పరంగా శాంతి చేకూరుతుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇష్టదైవ స్మరణ మంచిది.


క్రమంగా విజయాలు వరిస్తాయి. ఆపదల నుండి బయటపడతారు. అభివృద్ధి సూచితం. సాహసోపేత నిర్ణయాలు కలసివస్తాయి. భూ, గృహ, వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. అపార్థాలకు అవకాశముంది. వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తే మంచిది.


నిదానంగా ఆలోచించి పనులు మొదలుపెట్టాలి. పట్టుదలతోనే కార్యసిద్ధి. సమష్టి నిర్ణయాలు కలసివస్తాయి. కావాలని అవమానించే పరిస్థితులున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ద్వారా ఒత్తిడి ఉంటుంది. వారం మధ్యలో ఒక పనిలో లాభం వస్తుంది. తగినంత విశ్రాంతి
తీసుకోవాలి. ఇష్టదైవస్మరణ శుభప్రదం.


కోరికలు నెరవేరతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితముంటుంది. విఘ్నాలనుండి బయటపడతారు. వాగ్వాదాలకు అవకాశ మివ్వవద్దు. నలుగురినీ కలుపుకుపోయే ధోరణి అవసరం. ధనయోగం ఉంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే శక్తి లభిస్తుంది.


అదృష్టయోగముంది. సకాలంలో పనులు అవుతాయి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సంపదలు సమకూరుతాయి. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కలహాలకు తావుంది. ప్రసన్నంగా సంభాషించండి. నిర్ణయాన్ని బట్టి ఫలితాలుంటాయి. మీ శక్తిని గుర్తించి పనిచేయాలి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. సూర్యస్తుతి శుభప్రదం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.