రోజ్‌ రోజ్‌ రోజా హోటల్‌! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రోజ్‌ రోజ్‌ రోజా హోటల్‌!

విరిసిన చామంతులూ రోజాలూ లావెండర్లూ మొక్క నిండా ఉంటేనే కళ్లు పెద్దవి చేసుకుని పదే పదే చూడాలనిపిస్తుంది. మరి అలాంటి పువ్వులు హరివిల్లు వర్ణాల్లో గదిలో అంగుళం కూడా ఖాళీ లేకుండా విచ్చుకుంటే... అసలు ఓ హోటల్‌ అంతా అలానే ఉంటే... అందులోకి అడుగుపెట్టినవారి మనసుకి కలిగే ఆనందాన్ని వర్ణించగలమా..? బ్యాంకాక్‌లోని ‘కొరా కంగ్‌ కెఫె’కి వెళ్లేవారి పరిస్థితి కూడా ఇప్పుడలానే ఉందట. ఈ హోటల్‌ మొత్తాన్నీ లేత వర్ణాల గులాబీ చామంతీ లావెండర్‌లతో ఎక్కడా ఖాళీ లేకుండా అలంకరించేశారు. టేబుళ్ల అద్దాల కింది భాగంలోనూ పువ్వులే ఉంటాయి. దాంతో ఈ అందాలను చూడ్డానికే ఈ హోటల్‌కి జనం బారులు తీరుతున్నారట. ఇంతకీ అన్ని పువ్వుల్ని రోజూ ఎలా తెచ్చి పెడతారంటారా... నిజానికి ఇంత సహజంగా ఉన్న ఈ పువ్వులు కృత్రిమమైనవే మరి!


ఆకాశాన్ని తాకేలా ఠీవిగా నిలబడిన భవంతుల నడుమ నీళ్ల మధ్యలో కనువిందు చేస్తున్న ఈ గుండ్రని భవనాన్ని చూశారా! సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్‌ తీరంలో దిగ్గజ మొబైల్‌ సంస్థ ‘ఆపిల్‌’ కొత్తగా తెరిచిన రిటైల్‌ స్టోర్‌ ఇది. నీళ్లలో తేలుతూ ఉన్నట్టు, అదే సమయంలో చుట్టూ అందాలు కనువిందు చేసేలా దీన్ని అద్దాలతో నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పుడిది మొబైల్‌ స్టోర్‌గానే కాకుండా ఫేవరెట్‌ సెల్ఫీ స్పాట్‌గానూ మారిపోయింది!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు