అక్కడ... గడియారాలు వెనక్కి తిరుగుతాయి! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అక్కడ... గడియారాలు వెనక్కి తిరుగుతాయి!

మనకు ఎదురుగా ఉన్న గడియారాన్ని చూసినప్పుడు పైభాగంలో పన్నెండు అంకె, దానికి కుడి పక్కన ఒకటి, రెండు, మూడు సంఖ్యలూ ఉంటాయి. ముళ్లు కూడా కుడివైపునుంచే తిరుగుతుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇంతే. కానీ చిత్రంగా మనదేశంలోని దక్షిణ, మధ్య గుజరాత్‌లోనూ ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మాత్రం గడియారాలు తారుమారుగా కనిపిస్తాయి. ఇక్కడి ఇళ్లలోని గడియారాల్లో ముళ్లు వెనక్కు తిరుగుతాయి. ఒకటీ రెండూ అంకెలు కూడా పన్నెండుకు ఎడమ పక్కన ఉంటాయి. ఎందుకిలా అంటే... ‘హిందూ సంప్రదాయంలో ప్రదక్షిణ అంటే సవ్య దిశలో కుడివైపు నుంచి తిరుగుతారు. కానీ గిరిజనులు అపసవ్య దిశలో తిరుగుతారు. పొలంలో నాగలి దున్నినా అంతే. మా లెక్క ప్రకారం ప్రకృతి కూడా అపసవ్య దిశలోనే కదులుతుంది. కాబట్టి, మాకు మిగిలిన గడియారాలు తప్పుగా తిరుగుతున్నట్లనిపిస్తుంది’ అంటారు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన ఓ టీచర్‌. అందుకే, నాలుగేళ్ల కిందట స్థానిక తాపీ జిల్లాకు చెందిన ‘లాల్‌సింగ్‌ గామిత్‌’ అనే గిరిజనుడు ఈ ‘ఆదివాసీ గడియారాన్ని’ తయారుచేశాడట. అప్పట్నుంచీ ఇవి గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లలో వేల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి.

 

 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు