close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అట్టచూస్తే... పుస్తకం తెరవాల్సిందే!

వరికైనా ఏదైనా కానుకగా ఇవ్వాలంటే అది చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. మరి, డైరీల్లాంటివి ఇచ్చేటప్పుడు మాత్రం ఎందుకు రాజీ పడాలి... అది వాళ్లు ఎప్పటికీ మెచ్చే కళాఖండంలా ఎందుకుండకూడదు..? మనం రాసుకునే డైరీ అయినా మళ్లీ మళ్లీ చూసుకోవాలనిపించేంత అందంగా ఎందుకు కనిపించకూడదు..? అలా కావాలంటే ఈ ‘పాలిమర్‌ క్లే బుక్‌కవర్లు’ ఉండాల్సిందే. వీటిమీద ఫెయిరీటేల్‌ కథల్లోని పాత్రలూ జంతువులూ పక్షులూ పువ్వులను పాలిమర్‌ క్లేతో చూడచక్కగా చేస్తారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ అట్టలను విడిగానూ పుస్తకాలతో సహా కూడా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఈ కళను నేర్చుకోవాలనుకునేవారికోసం కొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ క్లాసుల్ని కూడా నిర్వహిస్తున్నాయి.


సోలార్‌ టేబుల్‌తో ఉపయోగాలెన్నో

న్‌ టేబుల్‌... అమెరికాకు చెందిన షేడ్‌క్రాఫ్ట్‌ సంస్థ తయారుచేసిన ఈ సోలార్‌ టేబుల్‌ సూర్యరశ్మితో కరెంటును ఉత్పత్తి చేసి మన ఫోన్‌ని ఛార్జ్‌ చేసేస్తుంది. అందుకోసం వైర్లు కూడా అవసరం లేదు. ఫోన్‌ని టేబుల్‌ కిందిభాగంలో ఉన్న అరలో ఉంచితే చాలు, దానంతటదే ఛార్జ్‌ అయిపోతుంది. అంతేకాదు, ఈ టేబుల్‌లో ఉండే స్పీకర్లతో పాటలు కూడా వినొచ్చు. ఆరుబయట కుర్చీలో కూర్చున్నప్పుడు కాఫీ కప్పులూ పేపర్‌లూ పెట్టుకునేందుకు మామూలు టేబుళ్లకు బదులుగా దీన్ని వేసుకుంటే ఒకేసారి మూడు ఉపయోగాలన్నమాట.


వడ్డించి ఎంత సేపైనా వేడిగానే!

ప్లేటులో అన్నం కూరలూ వడ్డించాక గభాల్న ఏదో అర్జంటు పనిమీద పక్కకు వెళ్లడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దాంతో మూతపెట్టినా తిరిగొచ్చేసరికి చల్లారిపోతుంటాయి. ఇక, పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చేసరికి అమ్మ ఇంటి దగ్గర లేకపోయినా వాళ్లకు ఇష్టమైన టిఫిన్‌, స్నాక్స్‌ టేబుల్‌ మీద ప్లేటులో వేడివేడిగా వడ్డించి ఉంటే వాళ్లకి ఎంత సంతోషమో. అమ్మ ప్రేమలోని ఆ అనుభూతిని కల్పించేందుకు కొరియాకు చెందిన డిజైనర్‌ సియోజంగ్‌ తయారుచేసిందే ఈ ‘మదర్స్‌ హార్ట్‌’. ప్లేటులాంటి దానిపైన పెద్ద గాజు గిన్నెను బోర్లించినట్లుండే దీన్లో వేడి లేదా చల్లటి పదార్థాలని వడ్డించిన ప్లేటుని పెడితే అవి ఎన్ని గంటలైనా అలానే ఉంటాయి. మనం వేడికోసం టైమ్‌ సెట్‌చేస్తే ఈ డోమ్‌లోపలి ఉష్ణోగ్రత అరవై డిగ్రీలకు చేరుకుంటుంది. అదే ఐస్‌క్రీమ్‌, కస్టర్డ్‌ లాంటివాటికోసం చల్లగా ఉండాలనుకుంటే ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలకు తగ్గిపోతుంది. ఎంత బాగుందో కదా..!


మనం ఎటు వెళ్తే ఫోన్‌ అటు తిరుగుతుంది!

న్‌లైన్‌ మీటింగులూ క్లాసులూ వీడియో కాల్స్‌... సర్వసాధారణమైపోయిన రోజులివి. అలాంటప్పుడు ఫోన్‌ని ఎదురుగా ఉన్న స్టాండ్‌లో పెట్టినా వీడియో కాల్‌ జరుగుతున్నంతసేపూ దాని ఎదురుగానే కదలకుండా కూర్చోవాలి. ఇక, ఏదైనా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చెయ్యాలంటే ఇంకొకరితో షూట్‌ చేయించుకోవాల్సిందే. సెల్ఫీలు కాకుండా ఫొటోలు తీసుకోవాలన్నా వేరొకరి సాయం అవసరం. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తున్నవే ‘ఆటో ఫాలో, ఆటో ట్రాకింగ్‌ ఫోన్‌ మౌంట్‌లు’. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్‌ స్టాండులో ఫోన్‌ని పెడితే చాలు, అది మన ముఖాన్నీ, కదలికల్నీ గుర్తించి మనం ఎటు వెళ్తే అటు 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అంటే, ఇకమీదట అటూ ఇటూ తిరుగుతూనే మీటింగుల్లో పాల్గొనొచ్చు, వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు