close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్క రోజుకు 75 లక్షలు!

ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ఐలాండ్‌కు ఒక్కసారి వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తోందా?ఆగండాగండి... ఇక్కడ ఒక్కరోజు గడపడానికి అయ్యే ఖర్చు సుమారు 75 లక్షల రూపాయలు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐలాండ్‌ రిసార్ట్స్‌ జాబితా తీస్తే, అందులో ముందుంటుంది ఫిలిప్పీన్స్‌లోని ‘బన్వా ప్రైవేట్‌ ఐలాండ్‌’. 15 ఎకరాల విస్తీర్ణం గల ఈ ద్వీపానికి వెళ్లాలంటే మనీలా నుంచి హెలికాప్టర్‌లో రెండు గంటలు ప్రయాణించాలి. ఎటుచూసినా పచ్చదనం పలకరించే ఈ ద్వీపంలో ఆరు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. లగ్జరీ అంటే ఇదేనేమో అనిపించేలా వీటిలో సకల సౌకర్యాలూ కల్పించారు. గోల్ఫ్‌, టెన్నిస్‌ ఆడటానికి మైదానాలూ, జిమ్‌, యోగా చేసేందుకు ప్రత్యేక ప్రదేశం ఉంటాయి. చుట్టూ సముద్రంలో చక్కర్లు కొట్టాలనిపిస్తే ఒక షిప్‌ కూడా ఉంది. స్కూబా డైవింగ్‌, జెట్‌ స్కైయింగ్‌, సెయిలింగ్‌ వంటివెన్నో చేయొచ్చు. ప్రొఫెషనల్‌ షెఫ్‌లు ఏంకావాలన్నా వండి పెడతారట. ఆ వంటల్లో వాడే కూరగాయలన్నీ కూడా, తేనెతో సహా ఇక్కడే ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తారట. ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే... ఇక్కడ ఒక్కరోజు ఉండి వెళ్లిపోతాం అంటే కుదరదు, సీజన్‌ను బట్టి మూడు నుంచి అయిదు రోజులు కచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఒక ట్రిప్‌కు కనీసం 2 కోట్లు పైనే చెల్లించాలన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు