close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఛఛ... తాగలే..!

రాత్రి పన్నెండింటికి భార్య భర్తకు వీడియోకాల్‌ చేసింది.
భార్య: ఎక్కడున్నారు?
భర్త: ఎక్కడో ఉన్నాలే, ఎందుకు ఫోన్‌ చేశావ్‌?
భార్య: ఏంటీ, ఏదో టెన్షన్‌గా ఉన్నట్టున్నారు...
భర్త: టెన్షన్‌ కాక ఏంటి... నా కారులో క్లచ్‌, బ్రేకు, స్టీరింగు అన్నీ దొంగలెత్తుకు పోయారు... ఇప్పుడు ఇంటికెలా రాను?
భార్య: తాగారా?
భర్త: నేను మందు ముట్టుకోనని నీమీద ఒట్టేశాగా, ఎలా తాగుతాననుకున్నావు. అయినా, నేను కారు గురించి చెబుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి?
భార్య: కారు వెనక సీట్లో నుంచి ముందుకు రండి, అన్నీ కనిపిస్తాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు