close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందమైన ఊరు... ఆదుకుంటోంది!

ఇరాన్‌లోని హార్మజ్‌ ద్వీపం... ప్రకృతి అందాలకూ ప్రాచీన కళలకూ నెలవు. కానీ ప్రస్తుతం ఆర్థికంగా దీనస్థితిలో ఉంది. పేదరికం అక్కడి ప్రజలతో అక్రమ రవాణా కార్యక్రమాలు చేయిస్తోంది. దీనికి పరిష్కారంగా వెలసిందే ఈ హరివిల్లు గ్రామం. ‘ప్రెజెన్స్‌’ పేరుతో మొదలుపెట్టిన ఓ ప్రాజెక్టులో భాగంగా జెడ్‌ఏవీ ఆర్కిటెక్ట్‌ అనే సంస్థ ఈమధ్యే వీటిని నిర్మించింది. రంగు రంగుల్లో గోపురాల్లా ఉండే ఈ ఇళ్లు పర్యటకుల్ని ఆకర్షించడంతో పాటు వారికి ఆతిథ్యమూ ఇస్తాయి. ఇక, వీటిలో కొన్ని ఇళ్లలో స్థానికులు రకరకాల వ్యాపారాలు నిర్వహించుకునే వీలు కూడా కల్పించారు. వాటిలో హస్తకళల ప్రదర్శనతో పాటు, కెఫె, లాండ్రీ... లాంటి వాటినీ నిర్వహిస్తారు. అదండీ సంగతి... ఈ రంగుల ఇళ్లతో అటు పర్యటకంగానూ ఇటు వ్యాపారంతోనూ స్థానికులకు ఆదాయం తీసుకురావడమే ఈ ప్రాజెక్టు వెనక ఉద్దేశం. అందమైన ఆలోచన కదూ!


నీలాల నింగిలో కాంతులీనాల్సిన హరివిల్లు నేలపైన వాలిందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా! ప్రకృతి చేసే మాయ అదే మరి. చేయితిరిగిన చిత్రకారుడెవరో వర్ణాలన్నీ కలగలిపి వయ్యారంగా తీర్చిదిద్దినట్టున్న ఈ ఇసుక తిన్నెలు... మారిషస్‌లోని ‘కేమరెల్‌ సెవెన్‌ కలర్డ్‌ ఎర్త్‌ జియో పార్క్‌’లోనివి. ఇక్కడి ఇసుకలో ఉన్న ఖనిజాల వల్ల ఇలా ప్రత్యేకమైన రంగులు వచ్చాయట. మరి ఈ వన్నెల అందాలు ఆస్వాదించడానికి పర్యటకులు బారులు తీరతారంటే ఆశ్చర్యమేముంది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు