close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (జనవరి 10 - 16)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. నలుగురినీ కలుపుకుని ముందుకుపోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఖర్చు పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం ఉత్తమ ఫలాన్నిస్తుంది.


సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచిమార్గంలో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. వారం మధ్యలో మంచి జరుగుతుంది. దగ్గరివారికి సమస్యలు వస్తాయి. ధైర్యంగా పరిష్కరించాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. గణపతి స్మరణ మేలుచేస్తుంది.


మనోబలంతో విజయం సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. అభీష్టసిద్ధికై బాగా శ్రమించాలి. వృధా ఖర్చు సూచితం. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. కొందరి వల్ల అపార్థాలు వస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. వారాంతంలో ఆనందించే అంశం ఉంది. ఇష్టదేవతా స్మరణ మంచిది.


భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగముంది. వస్తు, వస్త్రప్రాప్తి ఉంటుంది. ఉద్యోగరీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం, సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శివారాధన ఉత్తమం.

ధనలాభం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. గతం కన్నా మేలైన కాలమిది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహలాభం- వాహన యోగాలుంటాయి. సమాజహితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్త వింటారు. ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది.


అదృష్టయోగముంది. పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబసభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. విష్ణుస్తోత్రాలు చదువుకుంటే మంచిది.


ఉద్యోగ ఫలం బాగుంటుంది. వ్యాపారంలో కలసివస్తుంది. స్వల్ప విఘ్నాలున్నా పెద్ద ఇబ్బందేమీరాదు. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఇష్టదేవతాస్మరణ శక్తినిస్తుంది.


అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలుంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి. సుఖసంతోషాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతంకంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. శివారాధన కార్యసిద్ధినిస్తుంది.


ఉత్తమకాలం నడుస్తోంది. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్నిచేరతారు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఇష్టదైవారాధన శ్రేయస్సును పెంచుతుంది.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది.  లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబసభ్యులతో కలసిమెలసి ఉండాలి. ఆంజనేయస్వామిని స్మరించండి. మనోబలం లభిస్తుంది.


బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపారపరంగా శ్రమ ఉంటుంది. భూ-గృహ ప్రయత్నాలు కలసివస్తాయి. వస్తు, వస్త్రప్రాప్తి ఉంది. అంచలంచెలుగా పైకి వచ్చే అవకాశాలున్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం.


మంచికాలం నడుస్తోంది. ముఖ్యకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం సూచితం. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు