close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (జనవరి 17 - 23)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

శుభాలు జరుగుతాయి. పనులు పూర్తిచేసి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో  జాగ్రత్త అవసరం, ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వస్తు, వస్త్ర యోగాలుంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది.


అభీష్టసిద్ధి ఉంది. మనోబలంతో పనులు పూర్తిచేస్తారు. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం ఉంది.  ఒక పని సంతృప్తినిస్తుంది. బంధువులతో కలిసి ఆనందిస్తారు. కుటుంబపరంగా శుభం జరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివస్మరణ మేలుచేస్తుంది.


ప్రయత్న బలాన్నిబట్టి విజయం ఉంటుంది. ఉత్సాహంతో పనులు పూర్తిచేయండి. నిరుత్సాహం నష్టాన్ని సూచిస్తోంది. దైవశక్తి కాపాడుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. తోటివారి సహకారంతో నష్టాన్ని నివారించవచ్చు. ఓర్పుతో లక్ష్యాన్ని సాధించండి. వారాంతంలో శుభం జరుగుతుంది. విష్ణుసర్మణ మనశ్శాంతినిస్తుంది.


పట్టుదలతో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగానే ఉంది. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. న్యాయపరంగా అనుకూల కాలం. అపనిందలు మోపేవారున్నారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతోంది. లక్ష్యం చేరువలోనే ఉంది. నృసింహస్వామిని దర్శించండి. అంతా శుభమే జరుగుతుంది.


ఉత్తమ కాలం నడుస్తోంది. కీర్తి పెరుగుతుంది, సౌభాగ్యం సిద్ధిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. ఆపదలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదుగుదలకు అనుకూలమైన సమయమిది. ఇప్పుడు తలపెట్టే పనులు విజయాన్నిస్తాయి. ఇష్టదైవదర్శనం శుభప్రదం.


మంచి కాలం నడుస్తోంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికస్థితి బాగుపడుతుంది. సంకల్పసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభముంటుంది. అదృష్టయోగముంది. గొప్ప భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన సమయం. దుర్గాస్మరణ మేలు చేస్తుంది.


వ్యాపార లాభముంటుంది. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యకార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. కుటుంబసభ్యులకు మేలు జరుగుతుంది. చక్కని ఫలితం ఒకటి వారం మధ్యలో లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఇష్టదైవ స్మరణ మేలుచేస్తుంది.


ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. అభీష్టసిద్ధి ఉంటుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్నిస్తారు. సౌభాగ్యవంతులు అవుతారు. బంగారు జీవితాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితముంటుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. వారాంతంలో మంచి వార్త వింటారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది.


అద్భుతమైన కాలం నడుస్తోంది. తలచిన పనులు పూర్తి అవుతాయి. సంకల్పబలం గెలిపిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. గృహ, వాహనాది లాభాలు ఉంటాయి. మధ్యలో ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభిస్తారు. భూ లాభం సూచితం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. ఇష్టదేవతను ధ్యానిస్తే మంచిది.


ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. కష్టాలున్నాయి. లక్ష్యాన్ని చేరే క్రమంలో అలసట చెందుతారు. చెడు ఏమాత్రం ఊహించకూడదు. తెలివిగా ప్రవర్తించి అవరోధాలను అధిగమిస్తారు. దగ్గరి వారితో విభేదించవద్దు. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. గణపతి ధ్యానం శుభప్రదం.


అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి అవుతాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇంటా బయటా కలసి వచ్చే కాలం నడుస్తోంది. గృహలాభం, వాహనయోగం ఉంటాయి. దగ్గరివారికి మీ వల్ల కొంత మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో అభివృద్ధి ఉంటుంది. శ్రీరామనామాన్ని స్మరిస్తే మంచిది.


శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనుల్లో అధిక లాభముంటుంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. పలు విధాలుగా లాభపడతారు. బంధుమిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో గౌరవమూ గుర్తింపూ లభిస్తాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. లక్ష్మీ దర్శనం వల్ల కలసివస్తుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు