
మామూలుగా పదడుగుల దూరంలో పాములూ తేళ్లూ కనిపిస్తేనే ‘బాబోయ్’... అని పరిగెడతాం. పొరపాటున తొండలూ బల్లులూ మీద పడితే చిరాకు పడిపోతాం. కానీ కంబోడియా, జపాన్లలోని కొన్ని కెఫెలలో విష సర్పాలు టేబుళ్ల మీద పాకుతుంటాయి. జ్యూసు గ్లాసుల్ని చుట్టుకుంటాయి. తేళ్లూ పెద్ద పెద్ద తొండలూ బల్లులూ తాబేళ్లలాంటివి కూడా టేబుల్ మీద అటూ ఇటూ తిరుగుతుంటాయి. అలాంటి హోటళ్లకి ఎవరు వెళ్తారు... అనకండి. ‘రెప్టైల్ కెఫె’ పేరుతో నిర్వహిస్తున్న ఈ హోటళ్లు స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. అందుకే, ఒకదాని వెనుక ఇంకొకటి వెలుస్తున్నాయి. అయితే, ఈ కెఫెల్లో వదిలే పాములకి కోరల్నీ విషాన్నీ తీసేస్తారులెండి. అందుకే, పిల్లలూ పెద్దలూ వీటిని మెడలో వేసుకునీ ఒళ్లో పెట్టుకునీ ఆడుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం చేస్తుంటారు. ఎంత వి‘చిత్రం’..?
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్